ట్రంప్.. నీ ఇగో కన్నా దేశం గొప్పదని గుర్తించు.. ఇకనైనా ఓటమిని అంగీకరించు: ఒబామా ఫైర్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగి రెండు వారాలు కావొస్తోంది.. కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ.. విజేత జోబైడెనే అని తేలిపోయి 10 రోజులు పూర్తయ్యాయి.. ప్రపంచ దేశాల అధినేతలందరూ బైడెన్ కు అభినందనలు తెలుపుతూనే ఉన్నారు.. అయినాసరే ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం గెలిచింది తానే అని బల్లగుద్ది చెబుతున్నారు.. బైడెన్ విజయాన్ని అంగీకరించబోనని భీష్మించుకున్నారు.. దీంతో ఆయనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి..
Recommended Video
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్ ట్రంప్ ఇకనైనా ఒప్పుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నిజానికి ఫలితాలు వచ్చిన రోజు కానీ, రెండ్రోజుల తర్వాతైనా ట్రంప్ హుందాగా ఓటమిని అంగీకరించి ఉండాల్సిందని, బైడెన్ మెజార్టీ మరింత పెరిగిన తర్వాతైనా ట్రంప్ ఆపని చేసుండాల్సిందని ఒబామా అభిప్రాయపడ్డారు.

''ట్రంప్.. ఇప్పటికైనా మీ వ్యక్తిగత ఇగోను పక్కనపెట్టండి. కీలక సమయంలో ఇగో కంటే దేవమే గొప్పదని గుర్తించండి. మీ తరు వల్ల అమెరికా ప్రతిష్ట బజారునపడే పరిస్థితికి రావొద్దు. ఇప్పటికైనా బైడెన్ కు అధికార పగ్గాలను అప్పగించి హుందాగా తప్పుకునే అవకావం మీ చేతుల్లోనే ఉంది. నిజానికి అధ్యక్ష పదవి పర్మనెంటేమీ కాదు. దేశాధ్యక్షుడు అంటే ఒక ప్రజా సేవకుడు మాత్రమే. తన పదవీకాలం ముగిసిన వెంటనే తర్వాతి వ్యక్తికి బాద్యతలు ఇచ్చేయాలి'' అని ఒబామా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లోగానీ, గన నాలుగేళ్ల పాలనలోగానీ ట్రంప్ వ్యవహరించిన తీరుతో దేశం రెండుగా చీలిపోయిందని, డెమోక్రాట్లలో కానీ, రిపబ్లికన్లలో కాని ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ ను తాను ఎన్నడూ చూడలేదని ఒబామా అన్నారు. తన నాలుగేళ్ల పాలనలో ట్రంప్ దేశంలోని కీలక వ్యవస్థలను దెబ్బతీశారని, చేతిలో అధికారం ఉందికదాని రూల్స్ ను ఖాతరు చేయకుండా ఇష్టారీతిగా వ్యవహరించారని మండిపడ్డారు. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా బలహీనపడిందని ప్రత్యర్థి దేశాలు భావిస్తున్నాయని ఒబామా చెప్పారు.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications