వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పిందే చేశాడు..: ట్రంప్ తొలి సంతకం ఆ ఫైల్ పైనే..

తాజాగా కేర్ ఫైల్ నిబంధనల సడలింపుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ సంతకం చేశారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్.. నిన్నటితో అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సంతకం చేసిన తొలి ఫైల్ 'కేర్ ఫైల్'. ఒబామా కేర్ ను మార్చి తీరుతానని ఎన్నికల ప్రసంగాల్లో ట్రంప్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే.

అనుకున్నట్టుగానే కేర్ ఫైల్ నిబంధనలు సడలించాల్సిందిగా ఏజెన్సీలకు ట్రంప్ సూచించారు. తాజాగా కేర్ ఫైల్ నిబంధనల సడలింపుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ సంతకం చేశారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు వైట్ హౌజ్ వర్గాలు ఇంకా వెల్లడించలేదు.

Trump signs executive order that could effectively gut Affordable Care Act’s individual mandate

అయితే ఒబామా కేర్ ఆరోగ్య పథకాన్ని మారుస్తానని ట్రంప్ చెప్పినా.. దాని స్థానంలో ఎలాంటి పథకం తీసుకోరాబోతున్నామన్న విషయాన్ని మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. కేర్ ఫైల్ తో పాటు కొత్తగా నియమితులైన రక్షణ శాఖ మంత్రి జేమ్స్, మాటిస్, హోంలాండ్ సెక్యూరిటీ మంత్రి జాన్ కెల్లీలకు సంబంధించిన కమిషన్ల మీద ట్రంప్ సంతకాలు చేశారు.

భారత టెక్కీలకు అమెరికా షాక్: హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరంభారత టెక్కీలకు అమెరికా షాక్: హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం

కాగా, తొలిరోజంతా బిజీబిజీగా గడిపిన ట్రంప్.. బిజీగా ఉన్నా ఇది చాలా అందమైన రోజని చెప్పారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం అనంతరం ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రత్యేకంగా మరో కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదిలా ఉంటే, వైట్ హౌజ్ ప్రాంగణంలో ఉన్న విన్ స్టల్ చర్చిల్ విగ్రహం స్థానంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విగ్రహం పెట్టారు. అలాగే క్రిమస్సన్ డ్రేప్స్ స్థానంలో డ్రేప్స్ అమర్చారు.

English summary
President Trump signed an executive order late Friday giving federal agencies broad powers to unwind regulations created under the Affordable Care Act, which might include enforcement of the penalty for people who fail to carry the
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X