పుతిన్ కాచుకో.. ఇంకో 10 రోజులే.. ట్రంప్ సంచలన వార్నింగ్..
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకు పైగా భీకర యుద్ధం సాగుతూనే ఉంది. ఇటీవల వందలకొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ తో ఉక్రెయిన్ పై తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడింది. ఇటీవల ఉక్రెయిన్ పై 728 డ్రోన్ లు,13 మిసైల్స్ తో మారణహోమం సృష్టించింది. గత మూడేళ్లలో అదే అతి పెద్ద దాడి కావడం గమనార్హం. అంతేకాకా ఓ సారి 550 డ్రోన్ లు, 11 మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. అంతకుముందు 477 డ్రోన్ లు, 60 మిసైల్స్ లో భీకర దాడులు చేసింది రష్యా. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యాకు 50 రోజుల అల్టిమేటం ప్రకటించారు. 50 రోజుల్లో ఉక్రెయిన్ తో శాంతి చర్చలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు.
అయితే తాజాగా ఆ గడువును 10 లేదా 12 రోజులకు ట్రంప్ కుదించారు. పుతిన్ నుంచి ఎలాంటి పురోగతి రావడం లేదని ఇక సమయం ఇచ్చి లాభం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో తాను అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. రెండు వారాల క్రితం ట్రంప్.. పుతిన్ కు 50 రోజుల డెడ్ లైన్ విధించారు. ఈ లోపు ఉక్రెయిన్ తో చర్చలు జరపాలన్నారు.
"I'm disappointed in President Putin ... I'm going to reduce that 50 days that I gave him to a lesser number because I think I already know the answer what's going to happen." Donald Trump on Russia-Ukraine War and Putin
— WION (@WIONews) July 28, 2025
.
.
.
.
.
.
.#DonaldTrump #RussiaUkraineWar #russia #putin pic.twitter.com/bpGkZfzNeI
అయితే పుతిన్ నుంచి శాంతి చర్చలపై ఎలాంటి పురోగతి లేదా స్పందన రాకపోవడంతో తాజాగా ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పుతిన్ శాంతి చర్చలు జరిపేందుకు అంగీకరించడం లేదని స్పష్టమవుతోందని ట్రంప్ పేర్కొన్నారు. పుతిన్ ఎప్పుడూ యుద్ధాన్ని ముగించడంపై మాట్లాడుతారని.. కానీ ఉక్రెయిన్ పై మాత్రం దండయాత్ర చేస్తూనే ఉంటారని మండిపడ్డారు. పుతిన్ తీరుతో తాను అసంతృప్తి చెందినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు జులై 28 నుంచి ఇక పుతిన్ కు కేవలం 10-12 రోజులే మిగిలి ఉందని ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల రష్యా- ఉక్రెయిన్ మధ్య జులై 23 న మూడో దశ శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. ఇదివరకు రెండు సార్లు జరిగిన శాంతి చర్చలు విఫలం అయ్యాయి. ఈ క్రమంలోనే ట్రంప్.. రష్యాకు కీలక వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ స్పందించింది. ఈ మేరకు ట్రంప్ కు ఉక్రెయిన్ ప్రతినిధి యాండీ యెర్ మాక్ థ్యాంక్స్ చెప్పారు. రష్యాకు స్పష్టమైన సందేశం పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్రంప్ ప్రస్తుతం స్కాట్ ల్యాండ్ లో ఉన్నారు. ఈయూతో వాణిజ్య ఒప్పందం చేసుకోనుంది అమెరికా. అయితే ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాలో ఆకలి సంక్షోభం లేదని తెలిపారు. తాజాగా ఈ వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. వార్తా కథనాల ప్రకారం అక్కడి పిల్లలు ఆకలితో ఉన్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications