ఆఖరి ప్రచారానికి ట్రంప్ భారీ బడ్జెట్ : 166కోట్లతో మీడియాతో డీల్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించాలనే యోచనలో ఉన్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం చివరి రోజుల్లో ప్రచారానికి మీడియాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో.. ప్రచార స్లాట్స్ కోసం ఏకంగా రూ.166కోట్లు కేటాయించారు ట్రంప్.
హిల్లరీ-ట్రంప్ మధ్య హోరాహోరీ తప్పదన్న స్థానాల్లో ప్రచారానికి ఊపు తేవాలనే భావనలో ఉన్నారు ట్రంప్. ముఖ్యంగా.. ఎన్నికల్లో కీలక ప్రభావం చూపించనున్న ఫ్లోరిడా, ఓహియో, అయోవా, మైనే, నార్త్ కెరోలినా, నెవాడా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ ముందుందని ట్రంప్ గుర్తు చేస్తున్నారు. ట్రెండ్ ఇలాగే కొనసాగితే, ఎన్నికలు జరిగే రోజు అధ్యక్ష పదవికి కావాల్సిన 266 ఎలక్టోరల్ ఓట్లు తమ ఖాతాలో పడుతాయన్న ధీమాతో ఉన్నారాయన.

హిల్లరీ-ట్రంప్ మధ్యనున్న వ్యత్యాసం మిచిగాన్ లాంటి పలు రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గుతుందన్న వార్తల నేపథ్యంలో.. ఆఖరి రోజులను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు ట్రంప్.
-
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు.












Click it and Unblock the Notifications