వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుర్మార్గుడు.. నా ఫోన్ ట్యాపింగ్ చేశాడు: ఒబామాపై ట్రంప్ సంచలనం

అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా పైన అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఒబామా తన ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ ఆరోపణలను ఒబామా, ఆయన ప్రతినిధులు కొట్టి పారేశారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా పైన అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఒబామా తన ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ ఆరోపణలను ఒబామా, ఆయన ప్రతినిధులు కొట్టి పారేశారు.

అధ్యక్షుడి హోదాలో తాము లేదా, శ్వేత సౌధ ప్రతినిధులు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని చెప్పారు. హెచ్1బీ వీసాల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ట్రంప్ ఈ ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు.

<strong>'భారత్‌పై పాజిటివ్‌గా అమెరికా యంత్రాంగం', కన్సాస్ కాల్పులపై...</strong>'భారత్‌పై పాజిటివ్‌గా అమెరికా యంత్రాంగం', కన్సాస్ కాల్పులపై...

గత ఏడాది అధ్యక్ష ఎన్నికలకు ముందు ఒబామా తన కార్యాలయ ఫోన్‌ను ట్యాప్‌ చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపించి.. ఆయనను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది నాటి వాటర్‌గేట్ కుంభకోణం లాంటిదని ట్రంప్ అన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో వ్యాఖ్యలు చేశారు.

ఒబామాపై ట్రంప్ సంచలనం

ఒబామాపై ట్రంప్ సంచలనం

తన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలను ఆయన చూపలేదు. 'దారుణం! ట్రంప్‌ టవర్‌లోని నా ఫోన్లను ఒబామా ట్యాప్‌ చేసినట్లు ఇప్పుడే తెలుసుకున్నా. అయినా ఏమీ ప్రయోజనం లేదు' అని పేర్కొన్నారు.

ఇది చట్ట సమ్మతమా?

ఇది చట్ట సమ్మతమా?

అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి ఫోన్‌ను ప్రస్తుత అధ్యక్షులు ట్యాప్‌ చేయడం చట్టసమ్మతమా అని ప్రశ్నించారు. తన ఫోన్‌ను ట్యాప్‌ చేయడాన్ని కోర్టు ఒప్పుకోలేదని, అయినా ఒబామా దాన్ని ధిక్కరించారన్నారు.

ఒబామా దుర్మార్గుడు..

ఒబామా దుర్మార్గుడు..

ఒబామాను దుర్మార్గుడిగా అభివర్ణించారు. ఈ ట్యాపింగ్‌ వ్యవహారం.. 1970లలో నాటి అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ పదవికి ఎసరుపెట్టిన వాటర్‌ గేట్ కుంభకోణం లాంటిది అన్నారు.

ఆధారాలు తీయండి

ఆధారాలు తీయండి

చాలా పవిత్రమైన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా ఇలాంటి చర్యకు ఒబామా పాల్పడటం ఏమిటన్నారు. మంచి న్యాయవాదిని పెడితే ఇది పెద్ద కేసు అవుతుందన్నారు. అంతేకాదు, ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు కూడా వెలికితీయాలని ట్రంప్ సూచించారు.

English summary
US President Donald Trump has been urged to provide evidence to back his allegation that his predecessor, Barack Obama, ordered his phones to be tapped during the election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X