'ట్రంప్ వచ్చాడు, హిట్లర్ లాగే చేస్తాడు, తెలివి ఉంటే బ్యాగులు సర్దుకోండి'
ట్రంప్ వచ్చాడని, యూదుల విషయంలో హిట్లర్ ఎలా చేశాడో, ఇప్పుడు ముస్లీంల విషయంలో ట్రంప్ కూడా అలాగే చేస్తాడని ముస్లీంలను బెదిరిస్తూ కొన్ని లేఖలు మసీదులకు వెళ్లాయి.
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ వచ్చాడని, ఇక మీరు గడియలు లెక్కించుకునే రోజు వచ్చిందని, యూదుల విషయంలో హిట్లర్ ఎలా చేశాడో, ఇప్పుడు ముస్లీంల విషయంలో ట్రంప్ కూడా అలాగే చేస్తాడని అమెరికాలోని ముస్లీంలను బెదిరిస్తూ కొన్ని లేఖలు మసీదులకు వెళ్లాయి.
మూడు మసీదులకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ బెదిరింపు లేఖలు పంపించారు. హిట్లర్ హయాంలో యూదులకు పట్టిచ్చిన గతే ఇప్పుడు ట్రంప్ ముస్లింలకు పట్టిస్తారని పేర్కొన్నారు. పూర్తిగా ద్వేషభావంతో నిండిన లేఖల్లో అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్‌ని, ఆయన ముస్లిం వ్యతిరేక అభిప్రాయాలను ప్రశంసలతో ముంచెత్తారు. మీరంతా తెలివిగల వాళ్లయితే దేశాన్ని విడిచి ముందుగానే వెళ్లిపోవాలని పేర్కొన్నారు.

ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌హొసె, దక్షిణ కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్, పొమోనా మసీదులకు ఈ బెదిరింపు లేఖలు వచ్చినట్లు కౌన్సిల్ ఆన్ ఇస్లామిక్ అమెరికా రిలేషన్స్ అధికారులు వెల్లడించారు. ముస్లింలు అందరూ కిరాతకులు, మూర్ఖులు అంటూ లేఖల్లో పలు ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, మీరంతా సామాను సర్దుకొని పారిపోవటం మంచిదని పేర్కొన్నారని తెలిపారు.
చేతిరాతతో రాసిన లేఖ చివరిలో అమెరికన్స్ ఫర్ ఏ బెటర్ వే, లాంగ్ లివ్ ప్రెసిడెంట్ ట్రంప్, గాడ్ బ్లెస్ యూ అని రాసి ఉన్నట్లు తెలిపారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఇటువంటి చర్యలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని, ఇది మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విషయంగా పరిగణనలోకి తీసుకొని వారిపై చర్యలు చేపట్టాలని సీఏఐఆర్ అధికారి ఒకరు కోరారు.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications