చైనాపై ట్రంప్ బిగ్ బాంబ్.. లక్షల కోట్లు హాం ఫట్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ కంట్రీ చైనాపై 100 శాతం టారిఫ్ లు విధించారు. ఈ టారిఫ్ లు నవంబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాలోకి వచ్చే చైనా ఉత్పత్తులపై ఇకపై 100 శాతం సుంకాలు అమలు కానున్నాయి. ప్రస్తుతం అమెరికాకు ఎంతో అవసరం అయిన అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సడెన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతిపై చైనా కావాలనే ఆంక్షలు విధించినట్లు అమెరికాకు చెందిన అధికారులు చెబుతున్నారు. APEC సమావేశం నేపథ్యంలో అమెరికాను సంకట స్థితిలోకి నెట్టేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే చైనాకు గట్టిగా బదులు ఇచ్చేందుకు 100 శాతం సుంకాలు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

చైనా- అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ మరింత ముదిరినట్లుగా తెలుస్తోంది. తాజాగా చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రాగన్ దేశంపై 100 శాతం టారిఫ్ లు విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అమెరికాలో విక్రయించే చైనా ఉత్పత్తులపై ఇకపై 100 సుంకాలు అమలు కానున్నాయి. నవంబర్ 1, 2025 నుంచి ఈ టారిఫ్ లు అమల్లోకి రానున్నాయి.

చైనాలోని అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయకుండా ఆ దేశం ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా.. తన డిఫెన్స్ రంగాన్ని మరింత శక్తివంతంగా మార్చుకోవాలంటే, ఆయుధాలు ఉత్పత్తి చేయాలంటే అరుదైన ఖనిజాల అవసరం ఎంతో ఉంది. ఇటీవల పాకిస్థాన్- అమెరికా మధ్య రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ డీల్ ప్రకారం అమెరికాకు పాకిస్థాన్ అరుదైన ఖనిజాలను తవ్వి, ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తుంది.

అయితే చైనాపై టారిఫ్ బాంబ్ ప్రకటించిన అనంతరం తన వ్యక్తిగత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ లో ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. ఇందులో చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి చైనా నియమాలను తప్పుతోందన్నారు. మరింత కోపంగా డ్రాగన్ ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఇకపై బీజింగ్ హద్దుమీరితే మరిన్ని టారిఫ్ లు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Trump s Tariff Tsunami 100 Duties on China to Hit November 1

అయితే చైనాపై సడెన్ గా 100 శాతం టారిఫ్ లు విధించడంపై వాణిజ్య నిపుణులు పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ పై చైనా ఆంక్షలు.. అమెరికాలోని తయారీ, నిర్మాణ, రక్షణ రంగాన్ని దెబ్బకొట్టాయి. దీంతో ప్రతీకార చర్యగా చైనాపై అమెరికా టారిఫ్ లు విధించినట్లు సమాచారం. అలాగే చైనాపై టారిఫ్ లు విధిస్తే ఆ దేశం అమెరికాతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉందని వైట్ హౌజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+