సద్దాం హుస్సేన్ గ్రేట్: డోనాల్డట్ ట్రంప్ కితాబు
వాషింగ్టన్: ప్రముఖ వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టి నేత డోనాల్డ్ ట్రంప్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ టెర్రరిస్టులను చంపడంలో చాల మంచి వాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ తరపున ముందు వరసలో ఉన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సద్దాం హుస్సేన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మీద నిప్పులు చెరిగారు. ఓహియాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్బంలో ఒబామా మీద పలు ఆరోపణలు చేశారు. ఇరాన్, ఇరాక్ దేశాలను హస్తగతం చేసుకోవాలని ఒబామా ప్రయత్నించారని ఆరోపించారు.
ఈ రెండు దేశాలను హస్తగతం చేసుకుని క్రూడ్ ఆయిల్ పై చలామణి చెయ్యాలని ప్రయత్నించారని విమర్శించారు. అందుకే ఇరాక్ మీదకు అమెరికా సైన్యాన్ని ఒబామా పంపించారని ఆరోపించారు. అమెరికాలోని ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు జరగనున్న సందర్బంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాక్ పై అమెరికా పాల్పడిన చర్యలకు తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని ట్రంప్ వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో నియంత్రణ కోసం ప్రయత్నించరాదని గతంలో తాను చాలసార్లు హెచ్చరించానని అన్నారు. ఈ కారణంగానే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) పుట్టుకువచ్చిందని ట్రంప్ ఆరోపించారు.
ఇదే సమయంలో మాట మార్చిన ట్రంప్ ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ చాల మంచి వాడని ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు. ఉగ్రవాదులను చంపడంలోనే సద్దాం హుస్సేన్ మంచివాడని తాను చెప్పానని అన్నారు. ఇరాక్ లో టెర్రరిజం పుట్టుకురావడానికి కారణం ఒబామా తీసుకున్న నిర్ణయాలే అని ట్రంప్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications