సునామీ అప్‌డేట్ : 429కి చేరిన మృతుల సంఖ్య
జకార్తా : ఇండోనేసియాలో జళప్రళయం మిగిల్చిన విషాదం నుంచి అక్కడి ప్రజలు ఇంకా తేరుకోవడం లేదు. శనివారం రాత్రి అగ్నిపర్వతం బద్దలై సునామీలా విరుచుకుపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రకృతి విరుచుకుపడిన సమయంలో 222 మంది ఉన్న మృతుల సంఖ్య.. మంగళవారం నాటితో 429కి చేరింది. 1400 మందికి పైగా గాయపడ్డవారికి వైద్యం అందిస్తున్నారు అక్కడి అధికారులు. ఇప్పటివరకు 128 మంది గల్లంతైనట్లుగా రికార్డులు చెబుతున్నాయి.
సునామీ దెబ్బకు జావా, సుమత్రా కోస్టల్ ఏరియాలు మృత్యు కుహారాలుగా మారిపోయాయి. ఇళ్లు, చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్ ఇలా ఎన్నో నేలమట్టమయ్యాయి. నిలువ నీడ లేక చాలామంది నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నవారిని బయటకు తీసేలా సహాయకచర్యలు ముమ్మరం చేశారు.













Click it and Unblock the Notifications