దూసుకొచ్చిన బస్సు: 12మంది మృతి(వీడియో)
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. అంకారాలోని ఓ బస్టాప్‌లో ఎదురుచూస్తున్న ప్రయాణికులపై ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది వ్యక్తులు మృతిచెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం అంకారాలోని సెంట్రల్ డికిమెవి మెట్రో స్టేషన్ సమీపంలో బస్సు కోసం ఎదురుచూస్తోన్న వ్యక్తులపైకి బస్సు ప్రభుత్వానికి చెందిన ఓ బస్సు దూసుకురావడంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

మరో 8 మంది గాయపడినట్లు అంకారా గవర్నర్ మెహ్మెట్ కిలిక్లర్ ప్రకటించారు. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని బస్సు కింద నలిగిపోయిన మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications