సిరియా: రష్యా విమానాన్ని కూల్చిన టర్కీ (వీడియో)
టర్కీ: టర్కీ సైనిక దళాల దాడిలో కూలిపోయిన విమానం రష్యాది అని వెలుగు చూసింది. టర్కీ సేనలు కూల్చి వేసిన యుద్ద విమానం తమదేనని రష్యా ప్రకటించింది. తమ దేశానికి చెందిన ఎస్ యు-24 యుద్ద విమానం కూలిపోయిందని రష్యన్ అధికారిక వార్త సంస్థ తెలిపింది.
అయితే పైలెట్లు ఇద్దరూ విమానం కూలిపోవడానికి ముందే పారాచూట్ల సహాయంతో కిందకు దూకేశారని అన్నారు. ఇద్దరిలో ఒకరిని సిరియన్ తిరుగుబాటుదారులు ప్రాణాలతో పట్టుకున్నారని స్పష్టం చేశారు.

మరో పైలెట్ వివరాలు సేకరిస్తున్నామని రష్యా అధికారులు తెలిపారు. అయితే రష్యా విమానం పొరబాటున అటువైపు వెళ్లినందు వల్లనే టర్కీ సైనిక బలగాలు కూల్చివేశాయని సమాచారం.
విచారణ జరుగుతున్నందు వలన ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించలేమని రష్యా అధికారులు అంటున్నారు. రష్యా విమానం కూలిపోవడం, ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడే దృశ్యాలు ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతున్నాయి.












Click it and Unblock the Notifications