మా విమానాన్ని కూల్చింది టర్కీయే: పుతిన్

ప్యారిస్: టర్కీ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నదని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మండిపడ్డారు. టర్కీ కావాలనే తమ యుద్ద విమానం కూల్చి వేసిందని, వారు చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే టర్కీ తమ యుద్ద విమానాన్ని టార్గెట్ చేసుకునిందని ఆరోపించారు. ప్యారిస్ లో జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన వ్లదిమిర్ పుతిన్ తరువాత మీడియాతో మాట్లాడారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురౌతాయనే ఉద్దేశంతోనే తమ యుద్ద విమానాన్ని టార్గెట్ చేసుకుని కూల్చేశారని, తరువాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర సానుభూతి సంపాదించారని ఆయన ఆరోపించారు.

Turkey Shot Down Russian Warplane to Protect Islamic State Oil Trade, Vladimir Putin

టర్కీ భూ భాగంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చెందిన ఆయిల్ పైప్ లైన్ ఉందని ఇదే సందర్బంలో గుర్తు చేశారు. ఈ ఆయిల్ పైప్ లైన్ ఇస్లామిక్ స్టేట్ మాత్రమే నిర్వహిస్తుందని వ్లదిమిర్ పుతిన్ చెప్పారు.

ఆ పైప్ లైన్ ను తాము ఎక్కడ ద్వంసం చేస్తామో అని భయంతో తమ యుద్ద విమానాన్ని కూల్చి వేశారని ఆరోపించారు. కనీసం హెచ్చరికలు కూడా చెయ్యకుండా ఈ దారుణానికి పాల్పడ్డారని విమర్శించారు.

తమ యుద్ద విమానాన్ని టర్కీ కూల్చి వేసిందని తాము అనవసరంగా విమర్శించలేదని, తాము చేస్తున్న ఆరోపణలకు తగిన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+