పేలుళ్లు: రైల్వేస్టేషన్‌లో 30మంది, రెస్టారెంట్‌లో 17మంది మృతి
అంకారా: టర్కీ రాజధాని అంకారాలోని రైల్వేస్టేషన్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 30 మందికిపైగా మరణించారు. భారీ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
పేలుళ్లకు కారణం ఏంటి, ఎవరు అన్న విషయం ఇంతవరకు తెలియరాలేదు. ఆగ్నేయ టర్కీలో ప్రభుత్వానికి, కుర్దిష్ ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో శాంతి యాత్ర చేపట్టాలని యోచిస్తున్న తరుణంలో ఈ పేలుళ్లు సంభవించినట్లు సీఎన్ఎన్ టర్క్ తెలిపింది. పేలుళ్లుకు ఉగ్రవాదులే కారణమై ఉంటారని భావిస్తున్నారు.

రెస్టారెంట్‌లో పేలుడు: 30మంది మృతి
చైనాలోని ఓ రెస్టారెంట్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన అన్‌హుయ్ ప్రావిన్స్‌లోని వుహు నగరంలో చోటుచేసుకుంది.
రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం సంభవించిందని చైనా మీడియా వెల్లడించింది. పేలుడు కారణంగా రెస్టారెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టులో చైనాలోని తియాంజిన్ నగరంలో రసాయన కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించడంతో అగ్నిమాపక సిబ్బంది సహా సుమారు 160 మంది మరణించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications