సిరియా సరిహద్దు: యుద్ధ విమానం కూల్చివేత
అంకారా: టర్కీ సేనలు సిరియా సరిహద్దులో ఓ సైనిక విమానాన్ని కూల్చివేశాయి. స్థానిక మీడియా సైతం సిరియా సరిహద్దులో సైనిక విమానం కూలిపోయిందని స్పష్టం చేసింది. ఈ మేరకు కథనం ప్రసారం చేసింది.
మంగళవారం సిరియా సరిహద్దు మీదుగా తుర్కామెన్ పర్వతం సమీపంలోకి రాగానే టర్కీ సేనలు ఆ విమానాన్ని కూల్చివేశారు. ఆ విమానం శిథిలాలు పర్వతం మీదపడ్డాయని టర్కీ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

అయితే ఆ విమానం ఏ దేశానికి చెందినది అనే విషయం మాత్రం తెలియడం లేదని టర్కీ అధికారులు అంటున్నారు. ఆ విమానం వివరాలు తెలుసుకునేందుకు టర్కీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఫ్రాన్స్ సైనిక విమానం పొరపాటున టర్కీ వైపు వచ్చిందా అని ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications