ISIS: ఇస్లామిక్ స్టేట్ చీఫ్ హతం
ఇస్తాంబుల్: భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ లెవాంట్ చీఫ్ అబు హుస్సేన్ అల్ ఖురేషీ హతం అయ్యాడు. టర్కీ ఇంటెలిజెన్స్ బలగాలు అతణ్ని మట్టుబెట్టాయి. సిరియాలో ఈ ఆపరేషన్ కొనసాగింది. దీన్ని విజయవంతంగా ముగించినట్లు టర్కీ ప్రకటించింది. 60 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తయినట్లు పేర్కొంది. మృతదేహాన్ని పరీక్షించిన తరువాత అది ఐసిస్ చీఫ్‌దేనని నిర్ధారించినట్లు తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్ సహా పలు దేశాల్లో ప్రాణాంతక దాడులకు పాల్పడుతూ వస్తోంది ఐసిస్. పదుల సంఖ్యలో ప్రజలను పొట్టనబెట్టుకుంది. భారత్‌లోనూ ఈ ఇస్లామిక్ స్టేట్ జాడలు చాలా ఉన్నాయి. కేరళ, తమిళనాడుకు చెందిన చాలామంది ఐసిస్‌లో చేరినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఐసిస్ సానుభూతిపరులుగా ముద్రపడిన కొందరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

గతంలో ఈ ఉగ్రవాద సంస్థకు అబు బాకర్ అల్ బాగ్దాది సారథ్యాన్ని వహించాడు. నవంబర్‌లో ఆత్మాహూతి దాడిలో అతను చనిపోయాడు. బాగ్దాది స్థానంలో అబు హుస్సేన్ అల్ ఖురేషీ నియమితుడయ్యాడు. అతణ్ని అంతమొందించడానికి టర్కీ ఇంటెలిజెన్స్ బలగాలు రంగంలోకి దిగాయి. సిరియా ఉత్తరప్రాంతంలో జిన్దారిస్‌లో ఖురేషీ తలదాచుకుంటున్నట్లు పసిగట్టాయి.
టర్కీ సరిహద్దుకు ఆనుకునే ఉంటుంది ఈ జిన్దారిస్ టౌన్. ఫిబ్రవరి 6వ తేదీన టర్కీ, సిరియాల్లో సుమారు 50 వేల మందిని బలి తీసుకున్న పెను భూకంపాల్లో తీవ్రం నష్టపోయిన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. అబు హుస్సేన్ అల్ ఖురేషీ ఇక్కడే మకాం వేసినట్లు పక్కా సమాచారం అందిన నేపథ్యంలో టర్కీ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ ఆ పట్టణాన్ని చుట్టుముట్టి బాంబుల వర్షాన్ని కురిపించాయి.
టర్కీకే చెందిన తిరుగుబాటు బలగాలు సహకారంతో ఐసిస్ ఉగ్రవాదులు ప్రతిఘటించినప్పటికీ- అది ఎక్కువ సేపు కొనసాగలేకపోయింది. సుమారు గంట పాటు సాగిన భీకర పోరులో టర్కీ ఇంటెలిజెన్స్ బలగాలు.. ఖురేషిని హతమార్చాయి. అతను మరణించినట్లు ధృవీకరించుకున్న తరువాత ఈ విషయాన్ని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డగాన్ అధికారికంగా ప్రకటించారు.
తాము చేపట్టిన సైనిక చర్యలో ఖురేషీ చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు టర్కీ అధికారిక మీడియా సంస్థ టీఆర్టీ తుర్క్ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుగుబాటుదారులతో కలిసి టర్కీలో అసాంఘిక కార్యకలాపాలు, ఉగ్రవాద దాడులకు ఇస్లామిక్ స్టేట్ పాల్పడుతోందని, సిరియా నేషనల్ ఆర్మీ సహకారంతో తమదేశ ఇంటెలిజెన్స్ బలగాలు ఖురేషీని హతమార్చినట్లు ఎర్డగాన్ తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications