ఆడపిల్లను కందని భార్య హత్య: పోలీసులకు ఫోన్ చేసి..

ఈ ఘటనకు సంబంధించిన కేసు స్థానిక కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో ఈకేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తన భార్య నిద్రిస్తున్న సమయంలో దవడ కింద భాగంలో విద్యుత్ తీగను తగిలించి హత్య చేశాడు. ఆమెను హత్య చేస్తున్న సమయంలో నిందితుడు పోలీసులకు ఫోన్ చేశాడు. ఓ పోలీస్ అధికారితో చేసిన ఆ సంభాషణను డిఫెన్స్ న్యాయవాది కోర్టు ముందుంచాడు.
అందుకు సంబంధించిన వివరాలు:
నిందితుడు: నేను ఒకరిని చంపాను
పోలీస్: ఎవరిని చంపావు?
నిందితుడు: నేను ఇప్పుడు నా భార్యను చంపుతున్నాను
పోలీస్: నువ్వు ఆమెను చంపావా? లేదా చంపుతున్నావా?
నిందితుడు: ఆమె ఇంకా చనిపోలేదు. కానీ చంపుతున్నాను. ఇది హాలాల్
పోలీస్: నీకు ఆమెతో ఏంటి సమస్య?
నిందితుడు: నేను ఆమెను చంపుతుంటే మీరు సమస్య ఏంటని అడుగుతున్నారా, ఆమె అరవకుండా నోరును మూసేశాను.
పోలీస్: సరే! ఆగు నేను యూనిట్‌ను పంపిస్తున్నాను.
పోలీసుల నిర్లక్ష్యాన్ని డిఫెన్స్ న్యాయవాది ఈ సందర్భంగా తప్పుపట్టారు. పోలీసులు సరైన సమయంలో తగిన విధంగా స్పందించి ఉంటే ఓ నిండు ప్రాణం నిలబడేదని కోర్టుకు ఆయన విన్నవించారు. టర్కీలో మహిళలపై జరుగుతున్న గృహహింసకు తాజా ఘటన మరో నిదర్శనమని మానవ హక్కులు సంఘాలు అంటున్నాయి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications