2015-16: 2 వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు
శాన్ డియాగో: ఓ మహిళ వేర్వేరు సంవత్సరాల్లో కవలలకు జన్మను ఇచ్చింది. ఈ సంఘటన శాన్ డియాగో ఆసుపత్రిలో జరిగింది. మూడు రోజుల క్రితం 2015 సంవత్సరం వెళ్లిపోయింది. 2016 సంవత్సరంలోకి అడుగు పెట్టాం.
2015 వెళ్లే సమయానికి ఒకరు, 2016 సంవత్సరం ఆరంభమైన నిమిషాల్లో మరొకరు పుట్టారు. అలా నిమిషాల వ్యవధిలో ఇద్దరు కవలలు జన్మించారు. శాన్ డియాగోకు చెందిన మారిబెల్ వెలెన్సియా నొప్పులతో ఆసుపత్రిలో చేరింది.

ఆమె 2015 డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 11.59 నిమిషాలకు ఓ పాపకు, ఆ తర్వాత 2016 జనవరి 1వ తేదీన ఉదయం 12.02 నిమిషాలకు మరో పాపకు జన్మను ఇచ్చింది. వీరికి జైలీన్, లూయిస్ అని పేర్లు పెట్టారు. ఆ సమయంలో తాను గడియారం చూస్తూ కాలం గడిపానని మిరిబెల్ భర్త చెప్పాడు. కాగా, తల్లీ బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారు.












Click it and Unblock the Notifications