వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోమని చంపినందుకు 'నిషేధం': సోషల్ మీడియాలో వైరల్.. ఎందుకలా?

చనిపోయిన దోమ ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసినందుకు అతని ఖాతానే తొలగించేశారు.

|
Google Oneindia TeluguNews

శాన్‍ఫ్రాన్సిస్కో: చనిపోయిన దోమ ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసినందుకు అతని ఖాతానే తొలగించేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది.

వివరాల్లోకి వెళ్తే.. జపాన్‌కి చెందిన ఓ వ్యక్తి శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నాడు. అగస్టు 20న ఇంట్లో టీవీ చూస్తున్న క్రమంలో ఓ దోమ అతన్ని కుట్టినందుకు.. దాన్ని చంపి ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 'ప్రశాంతంగా టీవి చూస్తున్న సమయంలో నన్ను కుడుతావా.. చావు' అంటూ ఆ పోస్టులో పేర్కొన్నాడు.

అపై కొద్దిసేపటికే ట్విట్టర్ నుంచి అతనికో మెసేజ్ వచ్చింది. 'ఇక నుంచి మీరు మీ ఖాతాను ఉపయోగించలేరు' అని అందులో పేర్కొని ఉంది. దీంతో ట్విట్టర్ లో మరో ఖాతా ఓపెన్ చేసిన సదరు వ్యక్తి.. ఇలా చేయడం నిబంధనలకు విరుద్దమా? అంటూ మరో పోస్టు పెట్టాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 32వేల మంది రీట్వీట్‌ చేయగా 28వేల లైక్‌లు వచ్చాయి.

కాగా, హింసను ప్రేరేపించేలా ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచితే సంబంధిత ఖాతాలను తొలగిస్తామని గతంలోనే ట్విట్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
A Japanese man has been banned by Twitter after he posted a photo of a mosquito he killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X