పింకీతో మాల్యా మూడో పెళ్లిపై సెటైర్లే సెటైర్లు: పారిపోయే సమయంలో పక్కసీట్లో!
లండన్: బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా మూడో పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు వస్తున్నాయి. విజయ్ మాల్యా పెళ్లి వెనుక ఓ కుట్ర దాగి ఉందని, ఇది నిజానికి ఓ హనీట్రాప్ అని, మాల్యా ప్రేయసి పింకీ లాల్యాణీని నిఘా సంస్థలు రంగంలోకి దించాయని సెటైర్లు వేస్తున్నారు.
పెళ్లయ్యాక భారత్‌లోని తన కుటుంబాన్ని చూడాలంటూ పింకీ.. విజయ్ మాల్యాని బలవంతపెడుతోందని, ఇది హనీట్రాప్ కాబట్టి అతను రాగానే పోలీసులు అరెస్టు చేస్తారని కామెంట్లు చేస్తున్నారు. మాల్యా పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఒంటరిగా ఫీలవుతున్నాడు.. అందుకే
ఓ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని విజయ్ మాల్యా కొడుకు తన తండ్రిని అడిగితే.. కొడుకా.. నేను కూడా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మరో ట్విట్టరిటీ సెటైర్ వేశారు. మాల్యా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని మరొకరు పేర్కొన్నారు.

సెటైర్లే సెటైర్లు
విజయ్ మాల్యా వెడ్డింగ్ డేను ఎస్‌బీఐ హాలీడేగా ప్రకటిస్తుందని ఒకరు, సార్ మీ లోన్ డ్యూ ఉంది.. మీ ఇంట్రెస్ట్ ఎక్కడ అని బ్యాంకు ఆఫీసర్ అడిగితే.. పెళ్లిపై అని విజయ్ మాల్యా చెప్పినట్లుగా ఇంకొకరు సెటైర్లు వేశారు.

మూడేళ్ల ప్రైమకు నాడు వార్షికోత్సవం
కాగా, పింకీని 2011లో విజయ్ మాల్యా తొలిసారి కలిశారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఆమెకు ఎయిర్ హోస్టెస్‌గా ఆయనే ఉద్యోగం ఇచ్చారు. క్రమంగా వీరిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. అనంతరం అది ప్రేమగా మారింది. తరచూ పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత సహజీవనం చేశారు. ఇటీవలే తమ ప్రేమ బంధానికి మూడేళ్లు నిండిన సందర్భంగా తృతీయ వార్షికోత్సవం కూడా జరుపుకొన్నారు.

లండన్‌కు పారిపోయే సమయంలో పక్కనే
మాల్యా వాళ్ల అమ్మతోనూ పింకీకి మంచి అనుబంధం ఉంది. పలు కార్యక్రమాల్లో కనిపించేవారు. మాల్యాకు పింకీ మొదటి నుంచి తనదైన శైలిలో మద్దతు ఇస్తోంది. లండన్‌కు పారిపోయే సమయంలో విమానంలో ఆయన పక్క సీట్లోనే ఆమె ఉందని ఓ ప్రచారం ఉంది. కష్టసుఖాల్లో తోడుండాలని నిర్ణయించుకుందని అంటారు. మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించాలని లండన్ కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆమె కోర్టు హాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications