ఆర్ధిక కష్టాలు: ట్విట్టర్‌కు తగ్గుతున్న ఆదరణ
ట్విట్టర్‌కు రోజు రోజుకు ఆదరణ తగ్గపోతుంది. దీనిని ట్విట్టర్ అంగీకరించకపోయినా ముమ్మాటికీ ఇది నిజం. సామాజిక మాధ్యమాల పట్ల యువతలో ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ ఖాతాదారుల సంఖ్య అమాంతం పెరుగుతుంటే, ట్విట్టర్ యూజర్లు మాత్రం తగ్గుతున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ పేర్కొంది. గతేడాది చివరి మూడు నెలల్లో ట్విట్టర్ నుంచి 20 లక్షల మంది వైదొలగారు. ఇక షేర్ల విషయానికి వస్తే 12 శాతం తగ్గినట్టు ట్విట్టర్ యాజమాన్యం వెల్లడించింది. దీంతో ట్విట్టర్‌కు ఆదరణ తగ్గడంతో పాటు ఆర్ధికంగా నష్టాలను మూట గట్టుకుంటోంది.
అయితే ట్విట్టర్‌కు ఆదరణ తగ్గుతున్న విషయాన్ని గమనించిన యాజమాన్యం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త ఉత్పత్తులను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. అయితే ఈ కొత్త ఉత్పత్తుల విషయంలో ట్విట్టర్ అడ్రస్ సమస్యను ఎదుర్కొంటుంది.

దీంతో ఫేస్‌బుక్ తరహాలో అల్గారిథమిక్ టైమ్‌లైన్‌ను ప్రారంభించనున్నట్టు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ వెల్లడించారు. దీనివల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ప్రతిదీ మరింత స్పష్టమైనదిగా చేయడానికి తగిన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
మరోవైపు ఫేస్‌బుక్ మాత్రం తన ఖాతాదారులను అమాంతం పెంచుకుంటూ పోతోంది. ఇటీవలే ఫేస్‌బుక్ షేర్ల విలువ కూడా భారీగానే పెరిగింది. 2015 చివరకు ట్విటర్‌లో 30.50 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఫేస్ బుక్ కు 160 కోట్లమంది ఖాతాదారులున్నారు.
ట్విట్టర్ తర్వాత వచ్చిన సోషల్ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రాం కూడా ట్విట్టర్‌ను దాటిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రస్తుతం 40 కోట్లమంది యూజర్లు ఉన్నారు.
Twitter Sales:
Fourth quarter of 2014: $479 million
Fourth quarter of 2015: $710 million, up 48%
Twitter Profit:
Fourth quarter of 2014: - $125 million
Fourth quarter of 2015: - $90 million, 28% improvement
Twitter Active customers:
Third quarter of 2015: 307 million
Fourth quarter of 2015: 305 million, down less than 1%
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications