లిమిట్ లేదు: ట్విట్టర్ యూజర్స్‌కి శుభవార్త
న్యూయార్క్: ట్విట్టర్ ఖాతాదారులకు శుభవార్త. ట్విట్టర్‌లో ప్రత్యేక సందేశాలను పంపించేందుకు ఉన్న 140 అక్షరాల పరిమితిని సంస్థ ఎత్తివేయాలని నిర్ణయించింది.
ఈ పరిమితి విధించడంతో వినియోగదారులు సుదీర్ఘమైన చర్చకు, పెద్ద అంశాలను పోస్ట్ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతుండటంతో అక్షరాల పరిమితి తీసివేయాలనుకుంటున్నట్లు ట్విట్టర్ ప్రొడక్ట్ మేనేజర్ (డైరెక్ట్ మేసేజ్) సచిన్ అగర్వాల్ బ్లాగ్‌లో తెలిపారు.

గడిచిన ఏడాదికాలంలో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అక్షరాలపై పరిమితులు విధించడంతో వీరు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు గుర్తించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సదుపాయం జూలై నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications