వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ ఎఫెక్ట్: ఒక్కరోజులో 10,000 ఖాతాలను తొలగించిన ట్విట్టర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఒక్క రోజులో 10వేలకు పైగా ట్విట్టర్ ఖాతాలను తొలగించింది. ట్విట్టర్‌ను వేదికగా చేసుకోని ప్రపంచానికి హాని కలిగించాలని చూస్తోన్న ఐఎస్ఐఎస్ మద్దతుదారులు, వారు చర్చించుకుంటున్న అకౌంట్స్‌పై నిఘా ఉంచి వాటిని తొలగించనట్లు ట్విట్టర్ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

ట్విట్టర్‌ వినియోగదారులు పోస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క పోస్ట్‌ను పరిశీలించడం కష్టమని, అయితే కొన్ని సెర్చ్ పదాల ఆధారంగా పోస్టింగ్ చేసిన వాటిని సస్పెండ్‌లో పెడుతున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఉగ్రవీడియోలతో ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రముఖ ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్‌కు చెందిన సానుభూతి పరులు 90వేలకు పైగా అకౌంట్స్ నిర్వహిస్తునట్లు తెలుస్తోంది.

Twitter Says It Suspended 10,000 Islamic State-Linked Accounts in 1 Day

గత కొన్ని నెలలుగా ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్లను వారానికి 2వేలకు పైగా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని ఇటీవల కాలంలో ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్ రిక్రూట్ మెంట్స్ జరుగుతున్నాయని , దీన్ని నిలువరించడంలో ట్విట్టర్ విఫలమైందని గత కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి.

దీంతో ట్విట్టర్ ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన సానుభూతి పరులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లను తొలగించే పనిలో ట్విట్టర్ పడింది. గతంలో @JewHadi పేరుతో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ట్విట్టర్‌లో ఉగ్రకార్యకలాపాలు సాగించారు. ఈ అకౌంట్‌ను ట్విట్టర్ పూర్తిగా తొలగించింది.

English summary
Activists and experts who monitor the Twitter traffic of the Islamic State and its supporters noticed something odd last week when many accounts suddenly disappeared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X