అమెరికాలో గర్ల్స్ బర్త్‌డేపార్టీలో కాల్పులు, ఇద్దరు మృతి

Two arrested in Houston home shooting
వాషింగ్టన్: అమెరికాలోని ఓ పాఠశాల విద్యార్థినుల పుట్టిన రోజు వేడుకల పార్టీ రక్తసిక్తమైంది. తుపాకీ కాల్పుల్లో ఇద్దరు హైస్కూలు విద్యార్థులు మృతి చెందగా, ఇరవై మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇద్దరి విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

హోస్టన్ సబర్బన్‌లోని ఓ ఇంట్లో కాల్పుల ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. శనివారం రాత్రి ఓ ఇంట్లో జరిగిన పార్టీకి వంద మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులంతా పదిహేడేళ్ల నుంచి పందొమ్మిదేళ్ల వయస్సు వారే. అందరూ ఆనందంతో నృత్యం చేస్తుండగా ఒకరు గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈ గందరగోళ పరిస్థితుల మధ్య మరొకరు జనం పైకి కాల్పులు ప్రారంభించారు. అంతే పార్టీలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. భీతిల్లిన విద్యార్థులు భవనం రెండో అంత కిటికీల నుంచి దూకేశారు.

ఇంటికి వెళ్లే దారి ఇరుకుకావడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. కాల్పుల్లో ఎక్కువ మందే చనిపోయి ఉంటారని భయపడ్డారు. అయితే ఇద్దరు విద్యార్థులే మృతి చెందినట్టు అధికారికంగా వెల్లడించారు. సైప్రస్ స్ప్రింగ్ హైస్కూల్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి, 16 ఏళ్ల విద్యార్థిని మృతి చెందారు. ఈ కాల్పులకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+