క్షణాలలో ఇద్దరు ఉగ్రవాదుల హతం

డల్లాస్: విధులలో ఉన్న పోలీసులు క్షణాలలో ఇద్దరు ఉగ్రవాదులను అంతం చేశారు. ఒక ఎగ్జిబిషన్ మీద దాడి చెయ్యడానికి వచ్చిన వారిని అంతం చేసి అనేక మంది ప్రాణాలను రక్షించారు. అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

డల్లాస్ లో కార్టూన్ కాంటెస్ట్ ఎగ్జిబిషన్ జరుగుతున్నది. ఆదివారం ఎగ్జిబిషన్ హాల్ లో వివిధ దేశాలకు చెందిన అనేక మంది కార్టూనిస్టులు ఉన్నారు. ప్రదర్శన తిలకించడానికి చాలమంది వచ్చారు. హాల్ బయట పోలీసులు భద్రతా ఎర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.

Two gunmen who opened fire on Sunday at the anti-Islam art exhibit near Dallas

అదే సమయంలో ఒక కారు అక్కడికి దూసుకు వెళ్లింది. కారులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు ఒక్కసారిగా తుపాకులు తీసి కాల్పులు జరిపారు. అక్కడే ఉన్న పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండ ఎదురు కాల్పులు జరిపారు.

ఈ కాల్పులలో కారులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు అంతం అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు (రా), బాంబు స్కాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాడులకు పాల్పడింది తీవ్రవాదులని, ఇద్దరి మృతదేహాలు ఆసుపత్రికి తరిలించి దర్యాప్తు చేస్తున్నామని డల్లాస్ పోలీసు అధికారి బ్రూస్ జోయినర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+