200మిలియన్ డాలర్ల మోసం: ఇద్దరు ఇండియన్ అమెరికన్లకు జైలు

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: భారీ మొత్తంలో క్రెడిట్‌ కార్డుల మోసాలకు పాల్పడిన కేసులో అమెరికాలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులు జైలుపాలయ్యారు. ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డులకు సంబంధించి దాదాపు 200 మిలియన్‌ డాలర్ల మోసానికి పాల్పడిన కేసులో విజయ్‌ వర్మ(49), తర్సీమ్‌ లాల్‌(78) అనే ఇద్దరు వ్యక్తులకు ఏడాదికి పైగా శిక్ష పడింది.

Two Indian-Americans sentenced for credit card fraud in US

వీరిద్దరూ న్యూజెర్సీలో నగల దుకాణం యజమానులు. దోషులుగా తేలడంతో కోర్టు వారికి 14నెలల జైలు, 12 నెలల పాటు గృహనిర్బంధం విధించింది. అలాగే ఇద్దరికీ 5వేల డాలర్ల చొప్పున జరిమానా విధించారు.

అపరాధ రుసుము కింద 4,51,259 డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2013లో వర్మ, లాల్‌ కలిసి నకిలీ గుర్తింపులతో దాదాపు 7వేల క్రెడిట్‌ కార్డులు తీసుకుని 200 మిలియన్ డాలర్ల మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు రుజువయ్యాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two Indian-Americans in the US have been sentenced to over a year of imprisonment for a massive international credit card fraud involving more than $200 million.
Please Wait while comments are loading...