విమానాన్ని ఢీకొన్న యుద్ధ విమానం: ఇద్దరి మృతి
న్యూయార్క్: అమెరికాలోని సౌత్ కరోలినాలో ఓ చిన్న విమానాన్ని ఎఫ్-16 యుద్ధ విమానం ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్న విమానం పూర్తిగా ధ్వంసం కాగా, అందులోని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
యుద్ధ విమానం పైలట్ మాత్రం ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎన్‌టీఎస్‌బీ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.

పాక్‌లో వరదలు: 8 మంది మృతి
పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఆ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగాయి. ఇప్పటి వరకు 8 మంది వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications