భవనం మీద నుంచి తోసేసి రాళ్లతో కొట్టి చంపారు
సిరియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల (ఐఎస్ఐఎస్) అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు నగరాలను ఆక్రమించుకున్న ఉగ్రవాదులు ప్రజల మీద ప్రతాపం చూపిస్తున్నారు. స్థానికులను చిత్రహింసలకు గురి చేసి పలు రకాలుగా చంపేస్తున్నారు.
ఇటివల సిరియాలో ఇద్దరు యువకులు స్వలింగ సంపర్కులు అనే అనుమానంతో దారుణంగా హత్య చేశారు. వారిద్దరిని పెద్ద భవనం మీదకు తీసుకు వెళ్లి చేతులు వెనక్కి కట్టేశారు. తరువాత తాళ్లతో కాళ్లు కట్టి పై నుండి కిందకు తోసేశారు.

తల పగిలి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిద్దరిని రాళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. వారిద్దరిని ఎలా హత్య చేశారు అనే వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.
బహిరంగ శిక్షల వీడియోలను సోషల్ మీడియాకు విడుదల చెయ్యరాదని ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ బాగ్దాది ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజులకే ఉగ్రవాదులు వారు చేస్తున్న అరాచకాల వీడియోలను విడుదల చేశారు. గతంలో స్వలింగ సంపర్కులు అనే అనుమానంతో పలువురిని దారుణంగా హత్య చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications