ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, గాయాలు
బెర్లిన్: ఆకాశాలం విమానాలు గుద్దుకున్నాయి. స్విట్జర్లాండు గగనతంలో ఎగురుతున్న రెండు చార్టర్ ప్లైట్‌లు గాలిలో ఒకదానిని ఒకటి ఢీకొట్టాయి. దీంతో విమానంలో ఉన్న ఏడుగురు గాయపడ్డారు. ఆ రెండింటిలో ఒక విమానంలో సెయింట్ గాలెన్‌లోని కాంటన్ ప్రాంతంలో ఒక పొలంలో కూలిపోయింది.
అందులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండో విమానం అక్కడకు సమీపంలో ఉన్న స్విట్టర్ డార్స్ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండయింది. అందులో ఉన్న ముగ్గురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే, రెండు విమానాలు ఇలా ఢీకొట్టడానికి కారణాలు తెలియరాలేదు. లోపం పైలట్‌దా లేక కంట్రోల్ రూందా ఆనేది తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాఫ్తు చేపట్టారు.
కాగా, రెండు చార్టెర్డ్ ఫ్లైట్‌లు ఎమర్జెన్సీ ల్యాండిగ్ అవుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది.












Click it and Unblock the Notifications