అమెరికా బీచ్‌లో పట్టపగలు మహిళపై గ్యాంగ్‌రేప్: ఎవరూ అడ్డుకోలేదు

అరిజోనా: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని బీచ్‌లో పట్ట పగలు భారీగా జనాలు ఉన్న సమయంలో ఓ మహిళపై ముగ్గురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, అక్కడున్న వారు ఎవరూ కూడా ఈ ఘాతుకాన్ని అడ్డుకునేందుకు రాకపోవడం విచారకరం.

గత మార్చిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో చిత్రాల ఆధారంగా పోలీసులు ఇద్దరు నిందితులను నెల రోజుల తర్వాత గత శుక్రవారం అలాబామాలో అరెస్ట్ చేశారు. నిందితులు మహిళ పట్ల క్రూర జంతువుల్లా వ్యవహరించారని పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Two students arrested a month after video-recorded gang rape on crowded US beach

‘ఈ ఘటన పట్టపగలు వందలాది మంది జనాలు ఉన్న సమయంలో జరిగింది. అక్కడేం జరుగుతోందో వారందరికి తెలుసు. అయినప్పటికీ వారు స్పందించలేదు. ఘటనపై స్పందించాల్సిన వారు తమ వద్ద ఉన్న బీర్ సేవించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు' అని పోలీసులు అధికారి షరీఫ్ ఫ్రాంక్ మెక్ కేతన్ శుక్రవారం మీడియాకు చెప్పారు.

ఘటనకు సంబంధించిన వీడియోతో దర్యాప్తు జరిపామని, ఏప్రిల్ 2 తర్వాత నిందితుల కోసం గాలించి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నామని చెప్పారు. కాగా, తనను లాగి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అవమానకరంగా భావించి అమెరికాలోని చాలా మంది మహిళలు తమపై జరిగిన అత్యాచార ఘటనలపై ఫిర్యాదు చేయరని వైట్ హౌజ్ టాక్స్ ఫోర్స్ నివేదిక తెలిపింది.

మార్చి 10న జరిగిన ఈ ఘటన గురించి ప్రజలు ఎలాంటి నిరసనలు తెలపలేదు, కాగా, మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అమెరికాలోని వర్సిటీల్లో కాలేజీ విద్యార్థులు ఎక్కువగా విద్యార్థినిలుపై లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థినిల్లో ఐదుగురిలో ఒకరు లైంగిక వేధింపులకు గురైనవారే ఉంటారు. ఈ మేరకు వైట్ హౌజ్ టాక్స్ ఫోర్స్ నివేదిక వెల్లడించడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+