బట్టలు చించుకొని కొట్టుకున్న స్త్రీలు, వీడియో హల్‌చల్
బీజింగ్: ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్న ఓ వీడియో ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తోంది. వారు కొట్టుకున్నది రైలులో సీటు కోసం కావడం గమనార్హం.
సాధారణంగా బస్సుల్లో, రైళ్లలో ఇతర ప్రజా రవాణా వాహనాల్లో సీట్ల కోసం చాలామంది వాదులాడుకుంటారు. అప్పుడప్పుడు కొట్టుకనే స్థాయి వరకు వెళ్లిన సందర్భాలు కూడా మనం చూసి ఉంటాం. అయితే, ఈ మహిళలు దుస్తులు చించుకొని మరీ కొట్టుకున్నారు.
చైనాలోని బీజింగులోని సబ్ వేలో ఈ సంఘటన కొద్ది రోజుల క్రితం జరిగింది. ఈ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. వారు కొట్టుకోవడం కెమెరాల్లో పడింది. దీంతో, వారి తీరు వెలుగు చూసింది.
సమాచారం మేరకు.. ఇద్దరు మహిళలు కూడా ఒకే సీటు కోసం వాదులాడుకున్నారు. ఆ తర్వాత ఒకరి దుస్తులు మరొకరు పట్టుకొని ఘర్షణకు దిగారు. ఒకరి దుస్తులు మరొకరు చించేసుకున్నారు. బండబూతులు తిట్టుకున్నారు.












Click it and Unblock the Notifications