వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ టూర్: పాక్‌కు భారీ షాకిచ్చేందుకు సిద్ధమైన అమెరికా

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశం పాకిస్థాన్‌కు భారీ షాకిచ్చేందుకు సిద్ధమైంది.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశం పాకిస్థాన్‌కు భారీ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు పాకిస్థాన్‌కు ఉన్న మిత్రదేశం హోదాను రద్దు చేయాలని అమెరికా చట్ట ప్రతినిధులు టెడ్ పో, రిక్ నోలాన్ ఓ బిల్లును ప్రవేశపెట్టారు.

పాకిస్థాన్‌కు 13ఏళ్ల కిందట మేజర్ నాన్ నాటో అలీ(ఎంఎన్ఎన్ఏ) హోదాను ఇచ్చింది అమెరికా. కాగా, ఇంత చేసినా పాకిస్థాన్.. అమెరికాకు వెన్నుపోటు పొడిచిందని, అమెరికాకు అంటిన నెత్తుటి మరకలు పాక్ పనేని టెడ్, రిక్ ఆరోపించారు.

U.S. Congressmen introduce Bill revoking Pakistan's MNNA status

'చాలా ఏళ్లుగా అమెరికాకు మిత్ర దేశంగా పాక్ నటించింది. లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చింది. తాలిబన్లను ప్రోత్సహించింది. ఉగ్రవాదుల పని పట్టాలని చెప్పినా పాక్ అస్సలు పట్టించుకోలేదు' అని టెడ్ పో అన్నారు. అందుకే పాకిస్థాన్‌తో ఉన్న అన్ని సంబంధాలను అమెరికా తెంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

2004లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్.. పాక్‌కు ఎంఎన్ఎన్ఏ హోదా ఇచ్చారు. ఆల్ ఖైదా, తాలిబన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరుతూ ఆయన ఈ హోదా పాక్‌కు ఇవ్వడం జరిగింది. దీని వల్ల పాకిస్థాన్.. అమెరికా నుంచి భారీగా ఆర్థిక, ఆయుధ సాయాన్ని పొందింది. ఇప్పుడు హోదా తొలగిస్తే పాకిస్థాన్‌కు భారీ దెబ్బపడినట్లే.

English summary
Ahead of Indian Prime Minister Narendra Modi's visit to Washington, two influential US Congressmen have introduced a bill revoking Pakistan's status as a major non-NATO ally (MNNA), saying Islamabad's "treachery" has led to the deaths of too many American citizens
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X