కిమ్‌కు షాక్: కొరియా వైపు అమెరికా బలగాలు, భద్రత కోసమేనా?
న్యూయార్క్: కొరియన్ ద్వీపకల్పం చుట్టూ అమెరికా తన బలగాలను మోహరిస్తోంది. భద్రతపరమైన చర్యల్లో భాగంగానే కొరియన్ ద్వీపకల్పం చుట్టూ స్టెల్త్ బాంబర్స్‌ను మోహరిస్తోంది అమెరికా.
దక్షిణ కొరియాతో చర్చలకు తాము సిద్దమని ఉత్తరకొరియా ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరకొరియాతో చర్చలకు దక్షిణ కొరియా కూడ సంసిద్దతను వ్యక్తం చేసింది. రెండు దేశాల అధికారులు ఇటీవల కాలంలోనే పలు అంశాలపై చర్చలు చేస్తున్నారు.

దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలంపిక్స్‌లో పాల్గొనేందుకు తమ దేశం నుండి క్రీడాకారులను పంపుతామని కూడ ఉత్తరకొరియా కూడ సంసిద్దతను వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ రెండు దేశాల మధ్య చర్చలు సఫలమైతే వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఉత్తరకొరియా క్రీడాకారులు కూడ పాల్గొనే అవకాశం లేకపోలేదు.
వచ్చే నెలలో వింటర్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో సహా నేలమీద, నీటిమీద పోరాడగల షిప్‌ను ఆ ప్రాంతంలో దించుతోంది. ఇది అతి సాధారణ విషయమని, కేవలం భద్రతపరమైన చర్యల్లో భాగంగానే స్టెల్త్ బాంబర్స్‌ను రంగంలోకి దించుతున్నామని అమెరికా ప్రకటించింది.
ఒలింపిక్స్ ముగిసేవరకూ ఎలాంటి యుద్ధ విన్యాసాలను నిర్వహించటం లేదని వాషింగ్టన్ అధికార వర్గాలు తెలిపాయి. సియోల్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా నెమ్మదిగా చేరుతోందని ఉత్తరకొరియా చెబుతోంది.












Click it and Unblock the Notifications