వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎప్పుడైనా ‘సై’: యుద్ధానికి అంతా సిద్ధం.. ట్రంప్ ఆదేశమే తరువాయి.. బలపరీక్షలో అమెరికా!

అగ్రరాజ్యం అమెరికా పేరు తలచుకుంటే చాలు.. దాని శత్రుదేశాలకు కంటిమీద కునుకుండదు. అలాంటిది... ఓ చిన్న దేశం ఉత్తర కొరియా దాన్ని సవాలు చేస్తోంది. కొరకరాని కొయ్యగా మారింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా పేరు తలచుకుంటే చాలు.. దాని శత్రుదేశాలకు కంటిమీద కునుకుండదు. అలాంటిది... ఓ చిన్న దేశం ఉత్తర కొరియా దాన్ని సవాలు చేస్తోంది. కొరకరాని కొయ్యగా మారింది.

చైనాను చావుదెబ్బ తీసిన.. మోడీ వ్యూహాలు! మింగలేక.. కక్కలేక.. డ్రాగన్!!చైనాను చావుదెబ్బ తీసిన.. మోడీ వ్యూహాలు! మింగలేక.. కక్కలేక.. డ్రాగన్!!

అమెరికా హెచ్చరికలు చేస్తున్నా క్షిపణి పరీక్షలు యధేచ్ఛగా చేస్తూనే పోతోంది. ఐక్యరాజ్య సమితి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. మిత్ర దేశం చైనా కూడా ఈ విషయంలో ఉత్తరకొరియాను ఆపలేకపోతోంది.

అమెరికాతో పెట్టుకోగలదా?

అమెరికాతో పెట్టుకోగలదా?

ఉత్తర కొరియా లాంటి ఒక చిన్న దేశం ప్రపంచంలో ఏ దేశానికి లేని ఆయుధ సంపత్తి కలిగినటువంటి అమెరికాతో కయ్యం పెట్టుకోగలదా? పెట్టుకుని ప్రపంచ పటంలో తన ఉనికిని నిలుపుకోగలదా? ‘పిచ్చోడి చేతిలో రాయి' సామెతలా ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలకు పాల్పడుతూనే ఉంది. ఆ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ కనుసన్నల్లో జరుగుతున్న ఈ అణ్వస్త్రాల పరీక్షలను అగ్రరాజ్యం అమెరికా సీరియస్ గా తీసుకుంది. అసలు ఉత్తర కొరియా తనను సవాల్ చేయడమే అమెరికాకు పెద్ద ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచంలో ఏ దేశమూ చివరికి చిరకాల ప్రత్యర్థి రష్యా కూడా దానిని ఎదిరించలేని స్థితిలో ఉన్న అమెరికా ఉత్తర కొరియా ధైర్యం చూసి అవాక్కవుతోంది.

Recommended Video

Modi To Meet Trump Soon | Oneindia Telugu
సత్తా ఏమిటో చూపించాలని...

సత్తా ఏమిటో చూపించాలని...

ప్రపంచ దేశాలకు తన సత్తా ఏమిటో ఒకసారి చూపించాలనే ఆలోచన వచ్చింది అమెరికాకి. దాని దగ్గరున్న ఆయుధ సంపత్తిని కాస్తయినా ప్రదర్శించాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా తాజాగా బుధవారం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్(ఐసీబీఎం)ను పరీక్షించి చూసింది. గ్లోబల్ స్ట్రైక్ కమాండ్‌ ఆధ్వర్యంలో ఆ మిస్సైల్ టెస్ట్ నిర్వహించింది. దీనిని కల్నల్ మైకేల్ హవ్ పర్యవేక్షించారు. ఉత్తరకొరియా ప్రయోగించిన మిస్సైల్‌ కంటే ఇది చాలా శక్తివంతమైనదని మైకేల్ చెప్పారు.

జపాన్ తో కలిసి 10 గంటలపాటు...

జపాన్ తో కలిసి 10 గంటలపాటు...

ఇటీవల అమెరికా తన మిత్రదేశమైన జపాన్ తో కలిసి దాదాపు 10 గంటలపాటు సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఇందులో జపాన్ సైన్యం కూడా పాల్గొంది. ఈ సైనిక విన్యాసాల ద్వారా తన శక్తి ఏ పాటితో ఒకసారి ప్రపంచంలోని అన్ని దేశాలకు తేటతెల్లం చేయాలనేది అమెరికా భావన. తన వద్దనున్న ఆయుధ సంపత్తి చూశాక ప్రపంచంలోని మరే దేశమూ తన ఛాయలకు కూడా రాదని అమెరికా గట్టి నమ్మకం. యావత్ ప్రపంచంలో ఇప్పుడు అమెరికాను పదే పదే ధిక్కరిస్తున్న దేశం ఏదైనా ఉందంటే.. అది ఉత్తర కొరియా మాత్రమే.

సర్వం సిద్ధం.. ట్రంప్ సైగ చేస్తే చాలు...

సర్వం సిద్ధం.. ట్రంప్ సైగ చేస్తే చాలు...

ఉత్తరకొరియా పీచమణచడానికి అమెరికా నడుం బిగించింది. ఒకవేళ అమెరికాను టార్గెట్ చేస్తూ అణుబాంబు వేసినా అమెరికాకు వచ్చే ప్రమాదమేమీ లేదని కల్నల్ మైకేల్ హవ్ అంటున్నారు. అయితే ఉత్తరకొరియాపై సైనికదాడి గురించి ఇప్పటి వరకు శ్వేతసౌధం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా హుక్బి శాండర్స్ చెప్పారు. అమెరికా సైన్యం సర్వసన్నధంగా ఉందని, అధ్యక్షుడి ఆదేశాల కోసమే ఎదురుచూస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అంత సాహసానికి ఒడిగడుతుందా? అనే అనుమానం లేకపోలేదు.

తొలి ప్రాధాన్యం యుద్ధం కాదు... తప్పనిసరైతేనే...

తొలి ప్రాధాన్యం యుద్ధం కాదు... తప్పనిసరైతేనే...

తమ మొదటి ప్రాధాన్యం మాత్రం యుద్ధం కాదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రరెటరీ సారా హుక్బి శాండర్స్ స్పష్టం చేశారు. ఉత్తరకొరియాను కట్టడి చేసి, అది అణు పరీక్షలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవడమేనని ఆమె చెప్పారు. ఇవేవీ సాధ్యం కాని పక్షంలోనే తాము యుద్ధతంత్రానికి వెళ్తామని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవేళ ఉత్తరకొరియాపై అమెరికా సైనిక దాడి గనక మొదలైతే, దాని మిత్రదేశమైన చైనా చూస్తూ ఊరుకోదు. చైనా గనక రంగంలోకి దిగితే అమెరికాకు మద్దతుగా జపాన్ కూడా యుద్ధరంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా ఎన్ని అణ్వస్త్రాలు తయారు చేసినా వాటిని ఛిన్నాభిన్నం చేయగల శక్తి అమెరికాకు ఉంది.

English summary
The U.S. military successfully test-launched an Intercontinental Ballistic Missile from California early Wednesday, according to an Air Force spokesman — just days after North Korea's second test of an ICBM. The unarmed Minuteman III missile was launched at 2:10 a.m. PT from Vandenberg Air Force Base, about 130 miles northwest of Los Angeles. An Air Force statement said that the test was not a response to recent North Korean actions, but shows that America's nuclear enterprise is "safe, secure, effective and ready to be able to deter, detect and defend against attacks on the United States and its allies."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X