కారులో రేప్, లూటీ: ఉబెర్ డ్రైవర్ అరెస్టు

మెక్సికో: మెక్సికో నగరంలో ఓ మహిళా ప్రయాణికురాలిపై అత్యాచారం చేసి, తరువాత ఆమె నుంచి డబ్బులు లూటీ చేసిన ఉబెర్ కారు డ్రైవర్ ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక క్రిమినల్ కోర్టు ఆదేశాలు మేరకు నిందితుడిని వరోనిల్ నార్టె జైలుకు తరలించామని పోలీసులు చెప్పారు.

మే 2వ తేదిన జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. మెక్సికో సిటీలో రెస్టారెంట్లు, నైట్ క్లబ్ లకు పాపులర్ అయిన కండెసా డెవలప్ మెంట్ లోని ఓ బార్ నుంచి బయటకు వచ్చిన బాధితురాలు ఉబెర్ కారు డ్రైవరన్ ను డ్రాప్ చెయ్యాలని చెప్పి పిలిచారు.

Uber driver arrested for raping and robbing passenger in Mexico

తన ఇంటి అడ్రస్ చెప్పి అక్కడ దింపాలని డ్రైవర్ కు చెప్పారు. అయితే మార్గం మధ్యలో కారు డ్రైవర్ వాహనం నిలిపి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరువాత ఆమె వ్యానిటీ బ్యాగ్ లాక్కోని ఆమెను కారులో నుంచి కిందకు నెట్టి అక్కడి నుంచి పరారైనాడు.

బాధితురాలు తరువాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పలుకోణాలలో దర్యాప్తు చేశారు. నిందితుడిని గుర్తించడానికి బార్ యజమానిని విచారించారు. తరువాత సీసీ కెమెరా ఫుటేజ్ లు పరిశీలించారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+