మైనర్ బాలికపై క్యాబ్ డ్రైవర్ రేప్?: నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..
బ్రిస్బేన్‌కు చెందిన ఓ మైనర్ బాలిక(16)పై ఉబర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
బ్రిస్బేన్: ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ క్యాబ్ డ్రైవర్ ను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన వారంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండవదని తెలిపారు. తాజా ఘటనలో క్యాబ్ డ్రైవర్ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే.. జులై 8న బ్రిస్బేన్‌కు చెందిన ఓ బాలిక(16) నగరంలోని ఒక ప్రాంతానికి వెళ్లడానికి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ లో ప్రయాణిస్తున్న క్రమంలో డ్రైవర్ కన్ను ఆమెపై పడింది. మార్గమధ్యలోనే ఆమెను లైంగికంగా వేధించిన అతను.. క్యాబ్ ను దారి మళ్లించాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధిత బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్వీన్స్ ల్యాండ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు ఉబర్ సంస్థ.. అతని లైసెన్స్ రద్దు చేసింది. అరెస్టు అనంతరం అతన్ని బ్రిస్బేన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. తదుపరి విచారణ వరకు అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications