పెళ్లి చేసుకున్నాడు..సరిగ్గా ఆసమయంలో భార్యను చూసి షాక్ అయ్యాడు

పెళ్లి వయస్సు వచ్చిందంటే చేసుకోబోయే వ్యక్తి ఇలా ఉండాలి అలా ఉండాలి అని కలలు కంటాం. అయితే భగవంతుడు ఎవరిని రాసి పెట్టి ఉంటే అలాంటి వ్యక్తే జీవితంలోకి ప్రవేశిస్తారు. అయితే మన కథలో కూడా ఓ వ్యక్తి తను పెళ్లాడబోయే మహిళ గురించి ఎన్నో కలలు కన్నాడు. పెళ్లి అయితే జరిగింది కానీ.. రెండు వారాలకే అవాక్కయ్యాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది.. కథలో ట్విస్ట్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మూనాళ్ల ముచ్చటగా మిగిలిన పెళ్లి

మూనాళ్ల ముచ్చటగా మిగిలిన పెళ్లి

ఉగాండాలో ఓ ఇమామ్ ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంబరపడ్డాడు. చాలా ఆనందంగా ఉన్నాడు. ఇలా పెళ్లయిన రెండు వారాలకే అతని ఆనందమంతా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తన భార్య గురించి ఎన్ని కలలు కన్నాడో అన్నీ గంగలో కలిశాయి. ఆశలు ఆవిరయ్యాయి. మొత్తానికి ఆ ఇమామ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. మొహ్మద్ ముతుంబా అనే ఇమామ్ మహిళను ఇస్లాం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు. పెళ్లి కూతురుకు ఆ సమయంలో మెన్సెస్ అని చెప్పడంతో వారి ఆచారం ప్రకారం ఆమెను చూడలేదు.

 పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా..?

పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా..?

ఇక పెళ్లి జరిగింది. రెండు వారాల తర్వాత పెళ్లి కూతురు ముఖం చూసి షాక్ అయ్యాడు మొహ్మద్ ముతుంబా. అసలు పెళ్లి చేసుకుంది అమ్మాయిని కాదు. అమ్మాయి రూపంలో ఉన్న అబ్బాయినని గ్రహించి షాక్‌కు గురయ్యాడు. అయితే పెళ్లి కూతురు అబ్బాయి అని ఇమామ్ మొహ్మద్ ముతుంబా కనుక్కోలేదు. ఆయన బంధువులు కనుక్కున్నారు. పెళ్లి పేరుతో మహిళగా నటించి పెళ్లి చేసుకుని ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిందని మొహ్మద్ చెప్పాడు.

మహిళ అనుకొని సోదా చేసిన మహిళా పోలీస్

మహిళ అనుకొని సోదా చేసిన మహిళా పోలీస్

ఇమామ్ వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అమ్మాయి గెటప్‌లో ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే అక్కడికి కూడా అమ్మాయి గెటప్‌లోనే వచ్చాడు. బురఖా ధరించి అమ్మాయిలే వేసుకునే శాండల్స్ వేసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. జైలులో వేసే ముందు ఓ మహిళా పోలీసు అధికారిణి అమ్మాయి గెటప్‌లో ఉన్న వ్యక్తిని సోదా చేసి షాక్‌కు గురైంది.

డబ్బును కాజేసేందుకే...

డబ్బును కాజేసేందుకే...

మహిళ అని భావించి సోదాలు చేసిన మహిళా పోలీస్ అధికారిణి నోరెళ్లబెట్టింది. బ్రా ధరించిన ఆ వ్యక్తి బ్రెస్ట్ కలరింగ్ ఇచ్చేందుకు కొన్ని గుడ్డ ముక్కలను చేర్చాడు. అంతేకాదు ఆమెను పూర్తి స్థాయిలో సోదాలు చేయగా మగవాళ్ల జెనిటికల్ పార్ట్స్ ఉన్నాయని అధికారులు చెప్పారు. అయితే వారి స్టయిల్‌లో విచారణ చేయగా ఇమామ్ దగ్గర ఉన్న డబ్బును కాజేసేందుకే తాను మహిళ గెటప్ వేసినట్లు ఒప్పుకున్నాడు.

 శృంగారం చేయాలంటే కొన్ని షరతులు

శృంగారం చేయాలంటే కొన్ని షరతులు

ఇదిలా ఉంటే క్యాంపీసీ మసీదు దగ్గర మహిళా గెటప్ ఉన్న వ్యక్తిని కలిసినట్లు ఇమామ్ చెప్పారు. తాను పెళ్లి చేసుకునేందుకు ఓ మహిళ కోసం వెతుకుతున్న సమయంలో హిజబ్ ధరించి ఈ మహిళ గెటప్‌లో ఉన్న వ్యక్తి కనిపించడంతో తన ప్రేమను వ్యక్తపరచగా అందుకు అంగీకరించిందని వెల్లడించాడు. అయితే తనకు కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయని తన తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేంత వరకు శృంగారంలో పాల్గొనేది లేదనే షరతులు విధించినట్లు ఇమామ్ తెలిపాడు. ఇందుకు అంగీకరించి పెళ్లి చేసుకున్నట్లు ఇమామ్ తెలిపాడు. కానీ తీరా చూస్తే తాను పెళ్లిచేసుకుంది ఒక మగవాడినని గ్రహించి షాక్ అయినట్లు ఇమామ్ తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+