సీటు గొడవ: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ దారి మళ్లింపు

 Ugly dispute broke out after passenger refused to stop using "Knee Defender"
న్యూయార్క్: ఓ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. దీంతో విమాన పైలట్లు ఆ విమానాన్ని దారి మళ్లించారు. గొడవ పడ్డ ఇద్దరు ప్రయాణికులను దించేసి గంటన్నర ఆలస్యంగా విమానం మళ్లీ బయల్దేరింది. గొడవపడ్డ ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ నుంచి డెన్వర్ వెళుతున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరగడం వల్ల ఆ విమానాన్ని చికాగోకు దారిమళ్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిని చికాగోలోనే దించేసిన విమానం గంటన్నర ఆలస్యంతో తిరిగి డెన్వర్‌కు బయలుదేరింది.

విమానంలో వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి తన ముందు సీటును వెనక్కి వాల్చేందుకు వీలులేకుండా ‘నీ డిఫెండర్' అనే పరికరాన్ని బిగించాడు. దీంతో ముందు కూర్చున్న ఓ మహిళ తన సీటును వాల్చేందుకు ప్రయత్నించి.. ఆ పరికరాన్ని చూసింది. విమానాల్లో ఇలాంటి పరకరాలు నిషిద్ధమని, దానిని తొలగించాలని విమాన సిబ్బంది కూడా అతనికి నచ్చజెప్పారు. అయినా వినకుండా తనకు ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి స్థలం కావాలంటూ అతడు మొండిపట్టుపట్టాడు.

ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఆ మహిళ తన వద్ద ఉన్న గ్లాసులోని నీళ్లను అతడి ముఖాన విసిరికొట్టింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత చెలరేగింది. వారి అరుపులతో విమానం దద్దరిల్లింది. వారిద్దరి గొడవ ఆగే పరిస్థితి కనిపించకపోవడంతో సమీపంలోని చికాగోకు మళ్లించి విమానాశ్రయంలో దించేశారు. చికాగో విమానాశ్రయంలో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విమానం డెన్వర్‌కు గంట 38 నిమిషాల ఆలస్యంగా బయల్దేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+