సెల్ఫీ కోసం కోర్స్ తీసుకు వస్తున్న కళాశాల, 160 డాలర్లు
లండన్: యూకేలోని ఓ కళాశాల తమ విద్యార్థుల కోసం కొత్త కోర్స్‌ను తీసుకు వస్తోంది. ఆర్ట్ ఆఫ్ సెల్ఫీ పేరిట కొత్త కోర్సును విద్యార్థులకు ఆఫర్ చేస్తోంది. పూర్తిస్థాయి సెల్ఫీలు తీయడంలో నిష్ణాతులను చేయడం కోసం ఈ కోర్స్‌ను తీసుకు వస్తున్నారట.
సిటీ లిట్ కాలేజీ దీనిని ఆఫర్ చేస్తోంది. ప్రపంచంలోనే సెల్ఫీ కోర్స్‌ను ప్రవేశ పెడుతున్న కళాశాల ఇదే అని చెప్పవచ్చు. సెల్ఫీ కోర్స్‌ను 132 యూరోలు లేదా 160 డాలర్లకు నేర్పించనున్నారు. ఈ కోర్స్ ఈ ఏడాది మార్చ్ నెలలో ప్రారంభం కానుంది. ఈ కోర్స్ పేరు ది ఆర్ట్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ సెల్ఫ్ పోర్ట్‌రెచ్యూర్.

ఈ కోర్స్ వ్యవధి నెల రోజులు. ఈ ముప్పై రోజుల వ్యవధిలో సెల్ఫ్ ఫోటోగ్రాఫ్స్ ఎలా తీయాలో నేర్పుతారట. ఇప్పటికే సెల్ఫీల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెల్ఫీలు తీయడంలో తమదైన శైలిని, తాము తీసే వాటిని ఓ మంచి జ్ఞాపకంగా మలుచుకోవడం కోసం ఇది ఉపకరిస్తుందనే విద్యార్థులు ఈ కోర్సు వైపు అడుగులు వేయవచ్చు.












Click it and Unblock the Notifications