హనీమూన్ కోసం శ్రీలంక హోటల్లో దిగి, పీకలదాకా తాగి ఈ కొత్త జంట ఏం చేసిందంటే?
కొలంబో: తాగినప్పుడు మా కంటే ధనవంతులులేరు అన్నట్లుగా ఈ కొత్త జంట వ్యవహరించిన తీరు ఉంది. బ్రిటన్‌కు చెందిన ఓ జంట శ్రీలంకకు హనీమూన్ ట్రిప్‌కు వెళ్లింది. అక్కడ పీకల దాకా మద్యం తాగింది. ఆ తర్వాత వారు ఏ హోటల్లో మద్యం తాగారో అదే హోటల్‌ను కోనుగోలు చేశారు.
ఇది గత ఏడాది జరిగింది. కానీ అందరికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. మార్క్ లీ (35, గినా లియోన్స్ (33) జూన్ 2017లో పెళ్లి చేసుకున్నారు. తమ హనీమూన్ ట్రిప్‌గా శ్రీలంకను ఎంచుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత వారు చేసిందే వినడానికి ఆశ్చర్యంగా ఉంది.

బీచ్ సమీపంలోని హోటల్లో బస
మార్క్, గినా జంట లండన్ నుంచి శ్రీలంక వచ్చారు. అక్కడి బీచ్ సమీపంలోని ఓ హోటల్లో బస చేశారు. ఆ హోటల్ పేరు రస్టిక్ హోటల్. అక్కడ వారు మద్యం సేవించారు. ఆ సమయంలో వారు ఆ హోటల్ లీజు గడువు ముగిసేందుకు వచ్చిందని తెలుసుకున్నారు. ఆ తర్వాత గ్లాసుల కొద్ది మందు తాగారు. దాదాపు 12 గ్లాసుల రమ్ తాగారు.

కొత్త ఆలోచన
మద్యం నషాళానికి ఎక్కిన తర్వాత వారికి ఓ ఆలోచన వచ్చింది. హోటల్‍ను ఫ్రెష్‌గా లీజుకు తీసుకోవాలని భావించారు. హోటల్‌ను 30వేల పౌండ్లకు మన రూపాయల్లో రూ.29 లక్షలకు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

హోటల్ లీజుకు
మరుసటి రోజు వారు హోటల్ లీజుకు సంబంధించిన అంశంపై సంబంధీకులను కలిశారు. ఆ తర్వాత 30వేల పౌండ్లు చెల్లించి మూడేళ్లకు హోటల్‌ను లీజుకు తీసుకున్నారు. ఇందుకు గాను తొలుత 15వేల పౌండ్లు చెల్లించారు. మార్చి 2019లో మిగతా మొత్తం చెల్లించనున్నారు. మార్క్ - గినా జంట ఈ హోటల్‌కు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అధికారికంగా యజమానులు అయ్యారు. ఈ హోటల్ పేరును వారు లక్కీ బీచ్ తంగెల్లేగా మార్చారు.

ఇడియట్స్‌గా భావించినా
వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు వారిని ఇడియెట్స్‌గా భావిస్తున్నారు. అయితే వారి హోటల్‌కు కస్టమర్లు రెగ్యులర్‌గా వస్తున్నారు. హోటల్‌ను విస్తరించే ఆలోచనలో ఉన్నారు.

సాధారణ హోటల్ కానీ
కాగా, ఈ హోటల్ సాధారణంగా ఉంది. కానీ బీచ్ పక్కన ఉండటం ప్లస్. ఇది వుడెన్ ట్రీ హౌస్. అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. దీనిపై లియోన్స్ మాట్లాడుతూ.. తాము బీచ్‌లో మందు తాగుతున్న సమయంలో లీజ్ ముగింపు గురించి తెలిసి, మాట్లాడుకున్నామని, దీని లీజు ఏడాదికి 10వేల పౌండ్లు అని తెలుసుకున్నామని, నేను, మార్క్ కలిసి దీనిని మనమే లీజుకు తీసుకుంటే బాగుంటుందని ఆలోచన చేశామని, ఆ సమయంలో తాము తాగిన మత్తులో ఉన్నామని పేర్కొన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications