ఉప ప్రధాని రాజీనామా: రిషి సునక్ సర్కార్ పతనం?
లండన్: బ్రిటన్ ప్రభుత్వం మరోసారి సంక్షోభంలో పడినట్టే కనిపిస్తోంది. ఒకదాని తరువాత ఒకటి అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయక్కడ. ప్రధాన మంత్రి రిషి సునక్ (Rishi Sunak) తక్షణ నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ- పెద్దగా ఫలితాలనివ్వట్లేదు. ఇదివరకు బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో తలెత్తిన పరిస్థితులే ఇప్పుడూ అక్కడ నెలకొంటోన్నాయి. పెద్ద తలకాయల రాజీనామాలకు దారి తీస్తోన్నాయి.
రిషి సునాక్ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా పని చేస్తోన్న డొమినిక్ రాబ్ (Dominic Raab) తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. న్యాయ మంత్రిత్వ శాఖను ఆయనే పర్యవేక్షిస్తోన్నారు. బెదిరింపులకు సంబంధించి ఆయనపై అధికారికంగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రిషి సునక్ ప్రభుత్వం ఆయనపై దర్యాప్తునకు ఆదేశించింది. డామినిక్ రాబ్‌పై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు సాగించడానికి ఆడమ్ టాల్లీ కేసీ ఆధ్వర్యంలో స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసింది.

తనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు ఆదేశించడం పట్ల డొమినిక్ రాబ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పదవికి రాజీనామా చేస్తోన్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను ప్రధానమంత్రి రిషి సునక్‌కు పంపించారు. ఇదే లేఖ ప్రతులను తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పైనా పోస్ట్ చేశారు. రెండు పేజీలు ఉన్న రాజీనామా లేఖ ఇది. నా రాజీనామా ప్రకటన.. అంటూ సింగిల్ లైన్ ట్యాగ్ దీనికి జోడించారు.
తనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపించాలంటూ తానే ఇదివరకు డిమాండ్ చేశానని డొమినిక్ రాబ్ గుర్తు చేశారు. ఇందులో ఏదైనా బెదిరింపు ఉన్నట్లు తేలితే పదవికి రాజీనామా చేస్తాన ప్రకటించారు. దీనికి అనుగుణంగా ఆయన యూకే ఉప ప్రధానమంత్రి పదవికి గుడ్‌బై చెప్పారు. ఈ విషయంలో తన మాటను నిలబెట్టుకోవడం ముఖ్యమని నమ్ముతున్నానని అన్నారు డొమినిక్ రాబ్.

-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications