దేశవ్యాప్తంగా ఉద్యోగ గ్యారెంటీ!నిరుద్యోగానికి చెక్ పెట్టేలా బ్రిటన్ సంచలన నిర్ణయం..

యువతను పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యను తరిమికొట్టేందుకు బ్రిటన్ సర్కార్ నడుం బిగించింది. చదువు పూర్తి చేసుకుని సరైన ఉపాధి దొరకక, ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్న యువతను మళ్లీ పని రంగం వైపు తీసుకువచ్చేందుకు ఒక అద్భుతమైన ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. దీర్ఘకాలంగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువతీయువకులకు ప్రభుత్వమే స్వయంగా ఉపాధి భరోసా కల్పించేందుకు ముందుకు వచ్చింది.

నవంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా అమలు..

ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా నడిపిన 'ఉద్యోగ గ్యారెంటీ' పథకాన్ని నవంబర్ చివరి వారం నుంచి బ్రిటన్ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. యూనివర్సల్ క్రెడిట్ అందుకుంటున్న 18 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల అర్హులైన యువతకు ఈ పథకం కింద పర్మినెంట్ వేతనంతో కూడిన ఉపాధి లభిస్తుంది. డిపార్ట్‌మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 90 వేల మందికి పైగా యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది.

UK Government Expands Guaranteed Jobs Scheme Nationwide to Tackle Rising Youth Unemployment Today

వారానికి 25 గంటల పని..

ఈ ప్రత్యేక కార్యక్రమం కింద ఎంపికైన యువతకు వారానికి 25 గంటల పాటు వేతనంతో కూడిన పనిని కేటాయిస్తారు. ఇలా పనిచేసే వారికి ఆరు నెలల పాటు అందించే జీతభత్యాల మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాలలోని అన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తున్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నిబంధనలను మరింత సరళతరం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 18 నెలల నిరీక్షణా కాలం నిబంధనను 12 నెలలకు కుదించనున్నారు. అంటే, ఏడాది పాటు యూనివర్సల్ క్రెడిట్‌లో ఉన్న యువకులు ఎవరైనా సత్వరమే ఈ పథకానికి అర్హులవుతారు.

ముగ్ధ మృతి వెనుక అసలు నిజాలేంటి? ఎవరికీ తెలియకుండా ఇండియాకి ఎందుకొచ్చింది?
ముగ్ధ మృతి వెనుక అసలు నిజాలేంటి? ఎవరికీ తెలియకుండా ఇండియాకి ఎందుకొచ్చింది?

నిరుద్యోగం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ..

ప్రస్తుతం బ్రిటన్‌లో ఏ పనీ చేయకుండా, అలాగే చదువు లేదా శిక్షణ కూడా తీసుకోకుండా ఖాళీగా ఉంటున్న యువత సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 16 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల దాదాపు 9,81,000 మంది యువకులు ఇదే స్థితిలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఆ వయస్సు యువతలో ఏకంగా 13 శాతంగా ఉండటం గమసార్హం. ఒక వ్యక్తి ఎంతకాలం పనికి దూరంగా ఉంటే, మళ్లీ ఉద్యోగంలో చేరడం అంత కష్టమవుతుందని, ఏ యువకుడూ నిరుద్యోగంతో కుంగిపోకూడదని బ్రిటన్ వర్క్ అండ్ పెన్షన్స్ సెక్రటరీ పాట్ మెక్‌ఫాడెన్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

ఐపీఎల్ సృష్టికర్తకు బ్రిటన్ పౌరసత్వం. 'గాడ్ సేవ్ ది కింగ్’..
ఐపీఎల్ సృష్టికర్తకు బ్రిటన్ పౌరసత్వం. 'గాడ్ సేవ్ ది కింగ్’..

రానున్న నివేదికపై ఉత్కంఠ..

యువతలో పెరుగుతున్న ఈ నిరుద్యోగ నిష్క్రియతకు అసలు కారణాలు ఏమిటి? దాన్ని ఎలా రూపుమాపాలి? అనే అంశాలపై మాజీ మంత్రి అలాన్ మిల్బర్న్ నేతృత్వంలో రూపొందించిన ఒక సమగ్ర నివేదిక త్వరలోనే వెలువడనుంది. ఈ నివేదిక మరిన్ని సంచలన సిఫార్సులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదేమైనా, సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా యువతను స్వయంశక్తి వైపు నడిపించేందుకు బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+