ఉక్రెయిన్ యుద్దభూమిలోకి బ్రిటన్ ప్రధాని - కీవ్ లో ఆకస్మిక ఎంట్రీ - సైనిక సాయంపై హామీ..!!
ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా..ఏం చెప్పినా రష్యా అధ్యక్షుడు తన రూటులోనే వెళ్తున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్ష - ఉపాధ్యక్షులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో పర్యటించారు. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని నేరుగా యుద్దం సాగుతున్న ఉక్రెయిన్ రాజధానిలో కాలు పెట్టారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శనివారం ఆకస్మికంగా కీవ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఉక్రెయిన్ కు తొలి నుంచి అమెరికాతో కలిసి మద్దతు ఇస్తున్న బ్రిటన్..ఇప్పుడు మరింత సాయం కోసం స్వయంగా ప్రధాని వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీతో సమావేశమయ్యారు. ఆర్థికంగా, ఆయుధపరంగా కొత్త ప్యాకేజీలను ప్రకటించారు.
యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు 130 మిలియన్ డాలర్ల సహాయం అందిస్తామని ఇప్పటికే బ్రిటన్ ప్రధాని హామీ ఇచ్చారు. బోరిస్ ఇదే సమయంలో ఉక్రెయిన్ సైన్యానికి మరింతగా ఆయుదాలు సమకూర్చటం పైన నేరుగా జెలనెస్కీ చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. స్టార్‌స్ట్రీక్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు, మరో 800 యాంటీ ట్యాంక్ క్షిపణులను అందిస్తామని జాన్సన్ వెల్లడించారు. అటు అమెరికా - బ్రిటన్ వంటి దేశాలు ఉక్రెయిన్ ను మద్దతుగా నిలుస్తున్న సమయంలోనే ఇటు రష్యా వైమానిక దళాలు ఉక్రెయిన్ పైన విరుచుకుపడుతున్నాయి. తాజా దాడుల్లో మందుగుండు స్థావరంసహా ఉక్రెయిన్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు 19వేల 100మంది మాస్కో సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కివ్ పైనా ఫిరంగులు, మోర్టార్‌లు, రాకెట్ లాంచర్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యా దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 176 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు తరలివెళ్లినవారి సంఖ్య 44 లక్షలు దాటిందని ఐరాస శరణార్థుల ఏజెన్సీ వెల్లడించింది. మరో 71లక్షల మంది నిరాశ్రయులయ్యారని లెక్కలు బయట పెట్టింది. కీవ్ రీజియన్‌లోని మకరీవ్ పట్టణంలో 132 మృతదేహాలు బయటపడగా వారిని క్రూరంగా హింసించి హత్య చేసినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఉక్రెయిన్ ఆరోపణలు చేస్తోంది.












Click it and Unblock the Notifications