వింత: తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ, ముద్దు

లండన్: ఓ మహిళ తనకు తానే ప్రపోజ్ చేసుకొని, తనను తానే పెళ్లి చేసుకున్న వింత సంఘటన బ్రిటన్‌లో జరిగింది. ఒక్కదాన్నే ఉండి బోరు కొట్టేసిందని, పైగా, తనతో తాను పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయానని, అందుకే తనను తానే పెళ్లి చేసుకుంటున్నానని ఆమె వ్యాఖ్యానించింది.

బ్రిటన్‌కు చెందిన గ్రేన్ గెల్డర్ తనను తానే పెళ్లి చేసుకుంది. ఇతరులు దీని పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసినా ఆమె పట్టించుకోలేదు. తనను తాను పెళ్లి చేసుకునేందుకు చక్కగా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంది. గౌను కుట్టించుకుంది. ఉంగరాలను కొనుక్కుంది. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులను పిలిచింది. ఓ యాభై మంది ఈ పెళ్లికి వచ్చారు.

UK woman 'fed up of being single' proposes and marries herself!

ఓ వ్యవసాయ క్షేత్రంలోని అతిథి గృహంలో తనను తానే పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఇటీవలే జరిగింది. తనను తాను పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె తన చిత్రాన్ని అద్దంలో చూసుకుంటూ ముద్దుకూడా పెట్టుకుంది. పెళ్లి వాగ్ధానాలతో పాటు నవ వధువును జీవిత భాగస్వామిగా చేసుకొని, ఆప్యాయంగా చుంబించే ప్రక్రియనూ పూర్తి చేసింది.

తనతో తానే ప్రేమలో పడి, మరో వ్యక్తిని జీవిత భాగస్వామిగా భరించే ఇష్టం లేకే గ్రెన్ గెల్డార్ తనను తాను పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ పెళ్లికి చట్టబద్ధత లేదు. అయితే, తాను అవివాహితను కానని, అసలుసిసలైన పెళ్లి చేసుకున్నానని చెబుతోంది. తన చర్యలతో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+