రష్యాపై దాడి మొదలుపెట్టిన ఉక్రెయిన్ ? చమురు డిపోపై బాంబులు పడ్డాయన్న రష్యా

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న వేళ తాజాగా రష్యా చేసిన ఓ ఆరోపణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకూ రష్యా తమపై దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తుండగా.. తొలిసారి రష్యా తనపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు ప్రకటించింది. అదీ తమ దేశంలోని చమురు డిపోపై దాడి చేసిందని ఆరోపించింది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధం రష్యాకి సైతం పాకిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య 37వ రోజుకు చేరుకన్న నేపథ్యంలో రష్యా నుంచి తమపై ఉక్రెయిన దాడి చేసిందన్న ప్రకటతన వెలువడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత ఘోరమైన శరణార్థుల సంక్షోభంలో వేలాది మంది మరణించారు. 10 మిలియన్లకు పైగా నిరాశ్రయులయ్యారు. రష్యా పట్టణంలోని బెల్గోరోడ్‌లో జరిగిన సమ్మె సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి రష్యా తన భూభాగంపై ఉక్రేనియన్ వైమానిక దాడి జరిగిందని ప్రకటించడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.

ukraine begins counter attack ? russia claims air strike hits fuel depot in their land

అయితే తమ చమురు డిపోపై ఉక్రెయిన్ వైమానిక దాడి చేసిందని ఆరోపించిన రష్యా అంతకు మించిన వివరాలు వెల్లడించలేదు. దీంతో రష్యా ఈ ప్రకటన చేయడం వెనుక మర్మం ఏంటన్న దానిపై కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అసలే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్న అంశం ఇప్పుడు ప్రపంచ దేశాలకు చేరిపోయింది. దీంతో రష్యా తమ పరువు పోతోందని భావిస్తోంది. అలాంటి తరుణంలో ఉక్రెయిన్ తమ దేశంలోని చమురు డిపోపై వైమానికి దాడి చేసిందని ప్రకటించడం ద్వారా అంతర్జాతీయంగా సానుభూతి పొందాలని భావిస్తోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలే ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న రష్యాలో చమురు డిపోపై దాడి జరగడంపై చమురు దిగుమతి చేసుకుంటున్న యూరప్ దేశాల్లోనూ చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+