Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు: కాల్పుల్లో అమెరికా జర్నలిస్టు మృతి

కీవ్: ఉక్రెయిన్​పై రష్యా జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన వీడియో జర్నలిస్ట్​ ఒకరు చనిపోయారు. ఈ విషయాన్ని కీవ్​లోని పోలీసు అధికారి ఆండ్రియా కోబిటోవ్ వెల్లిడించారు. రష్యా దళాలు ఇర్పిన్ నగరంలో జరిపిన కాల్పుల్లో జర్నలిస్ట్ చనిపోయినట్లు తెలిపారు. మృతుడిని బ్రెంట్ రెనాడ్​గా గుర్తించారు.

ఈ మేరకు అతని మృతదేహాంతో పాటు సంస్థ గుర్తింపు కార్డు, అమెరికా పాస్​పోర్ట్​ను మీడియాకు చూపించారు. అయితే, మొదట అతను అమెరికాలోని ప్రతిష్ఠాత్మక వార్త సంస్థ అయిన న్యూయార్క్ టైమ్స్ ఉద్యోగిగా భావించారు. కానీ, ప్రస్తుతం బ్రెంట్ తమ సంస్థలో పని చేయడం లేదని న్యూయార్క్ టైమ్స్ యాజమాన్యం ప్రకటించింది.

ఘటనాస్థలంలో దొరికిన ఐడీ కార్డు చాలా ఏళ్ల క్రితం జారీ చేసిందని స్పష్టం చేసింది. చనిపోయిన వ్యక్తి ఇప్పటికే పాత్రికేయ రంగంలో పలు గొప్ప అవార్డులు అందుకున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. జర్నలిస్ట్​ మృతిపై పలు పాత్రికేయ సంఘాలు సంతాపం తెలిపాయి. రష్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 Ukraine blames Russia as US journalist shot dead in Irpin

పోలాండ్ సరిహద్దులోనూ రష్యా దాడులు 35 మంది మృతి

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులను కొనసాగిస్తోంది. ఇప్పుడు అన్ని వైపుల నుంచి దాడులు చేయడం ప్రారంభించింది. తాజాగా పశ్చిమ ఉక్రెయిన్​లోని సైనిక శిక్షణ స్థావరంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 35 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్​కు సాయంగా ఆయుధాలు సరఫరా చేస్తే.. ఆ వాహనాలు తమకు లక్ష్యాలుగా మారుతాయని రష్యా హెచ్చరించింది.

రష్యా సేనల తాజా దాడిలో అక్కడ ఉన్న లుట్స్క్‌ ఎయిర్‌ పోర్టు బాగా దెబ్బతింది. ఇది పొలాండ్‌ సరిహద్దులకు సమీపంలో ఉంది. ఇక్కడ ఇవనోవ్‌ ఫ్రాంకోవిస్క్‌ మిలటరీ ఎయిర్‌బేస్‌పై క్షిపణులతో దాడులు చేశారు. ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద సైనిక శిక్షణ కేంద్రాల్లో ఒకటి ల్వీవ్‌లో ఉంది. రష్యా దండయాత్ర నుంచి ఇప్పటివరకు సురక్షితంగా ఉన్న ల్వీవ్​లో​​.. 26 లక్షల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే తాజా దాడితో శరణార్థులు అక్కడ్నుంచి మరో చోటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+