పిల్లలు, పౌరులు చస్తున్నారు.. రష్యాకు బుద్ది చెప్పండి, ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా మీడియా ముందు కంటతడి పెట్టాడు. అతని భార్య అంతకుముందు భావొద్వేగంతో మాట్లాడారు. రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య జెలెన్ స్కా మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు జరుగుతున్న అన్యాయంపై ప్రపంచ దేశాలు నోరు విప్పాలని కోరారు. ఇన్ స్టాగ్రామ్‌లో వివిధ దేశ అధినేతల సతీమణిలతో మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ కు ఎలాంటి సాయం చేయగలమని వారు అడుగుతున్నారని, ప్రపంచానికి నిజం చెప్పడమే వాళ్లు చేసే సాయమని జెలెన్ స్కా అన్నారు.

రష్యా చెబుతున్నట్టు ఆ దేశం చేస్తున్నది సైనిక చర్య కాదని, పూర్తి స్థాయి యుద్ధమని ఆమె ఆరోపించారు. ఉక్రెయిన్‌ను ఎవరూ కాపాడాల్సిన అవసరం లేదని, తమకు సాయం మాత్రం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాటలు కాకుండా సైనికులకు, పౌరులకు ఆయుధాలు ఇచి ఆదుకోవాలన్నారు. అణు యుద్ధానికి పుతిన్ సిద్దమవుతున్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాలన్నారు. అదే జరిగితే ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశమంటూ ఏదీ ఉండదన్నారు. యుద్ధం వల్ల పిల్లలు బాంబ్ షెల్టర్లలో చదువుకోవాల్సి వస్తోందని, పేషెంట్లకు బేస్ మెంట్లలో చికిత్స చేయాల్సి వస్తోందని, వాటిపై మాట్లాడాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యా ప్రచారకర్తలు, క్రెమ్లిన్ పత్రికలు మీ కాదంటూ ఎన్ని హామీలిచ్చినా తమ పిల్లలు, పౌరులు చనిపోతూనే ఉన్నారన్నారు.

ukraine first lady emotional note on russia invasion

రష్యాకు చెందిన వేలాది మంది చనిపోయారని, ఆ విషయాన్ని రష్యా దాచేస్తోందని ఆమె చెప్పారు. ఉక్రెయిన్ ఆక్రమణ కోసం వచ్చిన రష్యా సైనికులు చనిపోతున్నారని వారి తల్లులకు చెప్పాలన్నారు. ఆందోళనలు చేయాల్సిందిగా రష్యన్లకు పిలుపునివ్వాలని కోరారు. వాళ్లు తమ సొంత నాయకత్వాన్ని చూసి భయపడిపోతున్నారని వివరించారు. యుద్ధం వారి అంతానికీ ఆరంభం అని చెప్పాలన్నారు. ఉక్రెయిన్ కు శాంతి మాత్రమే కావాలన్నారు.

తమకు మానవతా సాయం చేయాలనుకుంటే ఒక్కసారి తనకు చెప్పాలని కోరారు. ఉక్రెయిన్‌ను కాపాడుకునేందుకు పరస్పర సహకారం కోసం 'ద సమ్మిట్ ఆఫ్ ఫస్ట్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్' అనే ఓ వేదికను ఏర్పాటు చేశామని జెలెన్ స్కా చెప్పారు. అందులో భాగంగా లిథువేనియా ఫస్ట్ లేడీ లెఫ్టినెంట్ డయానా నౌసిడీన్, లాట్వియా ఫస్ట్ లేడీ ఎల్వీ ఆండ్రా లెవైట్ ఉక్రెయిన్ కు మద్దతుగా మాట్లాడారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+