రష్యాకు ఉక్రెయిన్ చుక్కలు : 14,700 మంది సైనికులు హతం.. అమెరికా అండతో జెలెన్ స్కీ దూకుడు !!
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు కొనసాగిస్తోంది. గత 25 రోజులుగా విధ్యంసం సృష్టిస్తోంది. నగరాలను టార్గెట్ చేస్తూ దురాక్రమణ సాగిస్తోంది. దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నపప్పటికి రష్యా సేనలను ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగానే ప్రతిఘటిస్తోంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య పలుమార్లు శాంతి చర్చలు జరిగినప్పటికి ఎలాంటి పురోగతి లభించలేదు. తమ డిమాండ్లకు ఉక్రెయిన్ ఒప్పుకుంటేనే యుద్ధానికి ముగింపు అని డెడ్ లైన్ పెట్టింది. రష్యా మరింత రెచ్చిపోయి దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌పై కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. భూగర్భ ఆయుధగారాన్ని ధ్వంసం చేసింది.
14,700 మంది రష్యా సైన్యం హతం
గత 25 రోజులుగా యుద్ధం సాగిస్తున్నా ఉక్రెయిన్‌పై రష్యా పట్టు సాధించలేకపోతోంది. రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. వారి దాడులను తిప్పుకొడుతున్నాయి. ఈయుద్ధపోరులో ఇరుదేశాలకు భారీగానే నష్టం వాటిల్లింది. రష్యా సేనలను ఉక్రెయిన్ ముప్పతిప్పలు పెడుతోంది. ఉక్రెయిన్ దళాల ప్రతిఘటనలకు రష్యా తీవ్రంగానే నష్టాపోతోంది. ఇప్పటి వరకు 14,700 మంది మాస్కో సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది . ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

యుద్ధ విమానాలు కూల్చివేత
అంతే కాకుండా, రష్యాకు చెందిన 476 యుద్ధ ట్యాంకులు, 1,487 ఆర్ముడ్ వాహనాలను ద్వంసం చేసినట్లు వెల్లడించింది. 96 యుద్ధ విమానాలు, 118 హెలికాప్టర్లు, 21 యూఏవీలను ఉక్రెయిన్ ఆర్మీ నేల కూల్చినట్లు తెలిపింది. మూడు యుద్ధ నౌకలు, 44 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ ను నాశం చేసింది. రష్యా సేనలను ఉక్రెయిన్ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. మరోవైపు రష్యాకు చెందిన ఒక ఎయిర్ బోర్న్ రెజిమెంట్ మొత్తాన్ని తమ సైనం నాశం చేసిందని ఉక్రెయిన్ ప్రకటించింది. రాజధాని కీవ్ కు సమీపంలో భీకర పోరు జరిగినట్లు తెలిపింది.

అమెరికా, నోటో దేశాల అండతో..
అమెరికా, బ్రిటన్, నాటో దేశాలు ఇస్తున్న సైనిక సహాయంతో రష్యాను ఘట్టిగానే ఉక్రెయిన్ దెబ్బతీస్తోంది. యుద్ధపోరులో ఉక్రెయిన్ కు అండగా ఉంటామని అమెరికా, ఈయూ దేశాలు ప్రకటించాయి. యుద్ధ సామాగ్రితో పాటు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నాయి. అయితే రోజులు ఇప్పటికే 25 రోజులు గడిచినా ఉక్రెయిన్ లొంగకపోవడంతో రష్యా తీవ్ర అసహనంతో ఊగిపోతోంది.
ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై దాడులను పెంచింది. సరికొత్త ఆస్త్రాలను రంగంలోకి దించింది. కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖార్కీవ్, మెరయుపోల్, ఎల్వీన్ నగరాల్లో విద్వంసం సృష్టిస్తోంది. నివాస ప్రాంతాలను టార్గెట్ చేస్తూ బాంబులతో విరుచుకుపడుతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications