ఉక్రెయిన్ నాటోలో చేరదు, వాస్తవం గ్రహించాలి: అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్స్కీ

కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ నేతృత్వంలోని నాటో మిలిటరీ కూటమిలో సభ్యత్వం పొందదని తమ దేశం అంగీకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్సీ స్పష్టం చేశారు. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనే రష్యా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జెలెన్క్సీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఉక్రెయిన్ నాటోలో సభ్యుత్వం పొందలేదు. మా కోసం నాటో తలుపులు తెరిచి ఉంచాయని మేము ఎన్నో ఏళ్లుగా భావించాం. కానీ, ఇప్పుడు మాకు వాస్తవం తెలిసి వచ్చింది. ఉక్రెయిన్ ఇక నాటో సభ్యత్వం తీసుకోదు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్కస్కీ స్పష్టం చేశారు.

Ukraine Must Recognise It Will Not Join NATO: Zelensky.

రష్యా కట్టడి విషయంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తదితర యూరోపియన్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నో-ఫ్లై జోన్‌ను అమలు చేయడానికి నిరాకరించినందుకుగానూ నాటో విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నాటో.. ప్రపంచంలో అత్యంత బలమైన కూటమి. అయితే, ఈ కూటమిలోని కొంతమంది సభ్యులు రష్యా దూకుడుతో హిప్నటైజ్ అయ్యారు' అని విమర్శించారు.

నో ఫ్లై జోన్‌గా ప్రకటించకపోవడం.. రష్యన్ సైన్యానికి ఉక్రెయిన్‌లోని శాంతియుత నగరాలపై బాంబు దాడులకు అనుమతి కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ప్రజలు.. నాటో కూటమి కంటే అంతర్జాతీయ భాగస్వాముల మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని అన్నారు. 'వాస్తవమే. ఉక్రెయిన్.. నాటో సభ్యత్వ దేశం కాదు. అందులో చేరలేమనీ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్‌ను రక్షించేందుకు భద్రతాపర హామీలు ఇవ్వాలి' అని జెలెన్క్సీ వ్యాఖ్యానించారు.

రష్యా సరిహద్దులోని ఇతర దేశాలు.. నాటో మినహాయించి తమ స్వతంత్ర రక్షణ సామర్థ్యాల గురించి ఆలోచించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు సూచించారు. బ్రిటన్‌, ఇతర దేశాల నుంచి అందుతున్న ఆయుధ సరఫరాలు సరిపోవడం లేదని, ఫలితంగా రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలు, పాత సోవియట్ కాలం నాటి కిట్‌లను వినియోగించాల్సి వస్తోందని వాపోయారు. రష్యాపై పూర్తిస్థాయి వాణిజ్య ఆంక్షలను విధించాలని కోరారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, నాటో తోపాలు పలు దేశాలు కూడా రష్యాపై ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. పలు అంతర్జాతీయ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను రష్యాలో నిలిపివేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+