ప్రధాని మోడీపై ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ ఫైర్-పుతిన్ తో భేటీపై-నిరాశపర్చారంటూ..!
భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే రష్యాలో రెండోరోజు పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. అధినేత పుతిన్ తో భేటీ అయ్యారు. ఇవాళ అక్కడ నివసిస్తున్న భారతీయులతో సమావేశం నిర్వహించారు. అసలే ఉక్రెయిన్ యుద్దం తర్వాత రష్యాతో బంధాల్ని పూర్తిగా తెంచుతున్న ప లుదేశాలు మోడీ మాస్కో టూర్ పై అసంతృప్తిగా ఉన్నాయి. అయితే వెంటనే దీనిపై స్పందించడం లేదు. కానీ రష్యా యుద్దం చేస్తున్న ఉక్రెయిన్ మాత్రం ఘాటుగా స్పందించింది.
మోడీ రష్యా టూర్, పుతిన్ తో భేటీ కావడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగాఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి జరిగిన రోజే ఈ భేటీ జరగడాన్ని జెలెన్ స్కీ తప్పుబట్టారు. మోడీ టూర్ తమను తీవ్రంగా నిరాశపర్చిందని, శాంతి ప్రయత్నాలకు ఇది విఘాతం కల్పించిందంటూ వ్యాఖ్యానించారు.ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు (మోడీ) కీవ్ లో పిల్లల ఆస్పత్రిపై దాడి చేసిన రోజున మాస్కోలో ప్రపంచంలోని అత్యంత రక్తపాత నేరస్థుడిని కౌగిలించుకోవడం చాలా నిరాశ, శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ అని జెలెన్స్కీ ఎక్స్ లో పోస్టు చేశారు.

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించి ఏడాది గడిచిపోయినా ఇంకా ఆగలేదు. ఈ దాడుల్లో లక్షలాది మంది చనిపోతున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయినా రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మోడీ రష్యా టూర్ పై పాశ్చాత్య దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. జెలెన్ స్కీ వ్యాఖ్యలు కూడా ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయి. అయితే మోడీ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రష్యాలో పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications