రష్యా సైన్యానికి చుక్కలు చూపించిన ఉక్రెయిన్ రైతు .. యుద్ధ ట్యాంకర్ ఎత్తుకెళ్లి మరీ !!
ఉక్రెయిన్‌పై రష్యన్ సేనలు దాడులను తీవ్రతరం చేశాయి. బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యా బలం, బలగంతో పోల్చితే ఉక్రెయిన్ సామర్థ్యం తక్కువే. అయినా యుద్ధపోరులో వెనుకడుగు వేయడం లేదు. రష్యా దాడులను ధైర్యంగానే ప్రతిఘటిస్తోంది. ఇప్పటికే 6వేల మందికి పైగా రష్యా సైన్యం మృతి చెందారని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా దాడులకు బెదిరేది.. వెనక్కి తగ్గేది లేదంటూ .. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హెచ్చరించారు.

ఉక్రెయిన్ రైతు తెగువ
ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా రష్యా మాత్రం తన దూకుడును తగ్గించలేదు. ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లోకి భారీ ఆయుధాలు, యుద్ధ ట్యాంకులతో దూసుకోస్తోంది. రష్యా దాడులను ప్రతిఘటించడంలో ఉక్రెయిన్ సైనికులే కాదు.. పౌరులు కూడా తుపాకీ పట్టారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన రైతు తన తెగువను చూపించారు. ఏకంగా రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకునే ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
యుద్ధ ట్యాంకర్‌ను ట్రాక్టర్‌కు కట్టుకోని..
ఉక్రెయిన్ పై దాడి చేసేందుకు రష్యా సైన్యం యుద్ధ ట్యాంకర్‌తో ఓ ప్రాంతానికి చేరుకుంది. దీనిని గమనించిన సదరు రైతు గుట్టుచప్పుడు కాకుండా ఆ యుద్ధ ట్యాంకర్‌ను తన ట్రాక్టర్‌కు కట్టుకోని అక్కడి నుంచి తరలించాడు. దీంతో ఇది గమనించిన రష్యా సైనికుడు రైతు ట్రాక్టర్ వెనుక పరిగెత్తాడు. రైతు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రష్యా దాడి క్షీణిస్తున్నట్లుంది..
ఈ వీడియోను బ్రిటిష్ కన్జర్వేటివ్ నేత, ప్లైమౌత్ మూర్ వ్యూ పార్లమెంటు సభ్యుడు జానీ మెర్సర్ తన ట్విటర్‌లో వేదికగా పంచుకున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా దాడి క్షీణిస్తున్నట్లు ఉందని అంటూ పేర్కొన్నారు. తమ దేశాన్ని రక్షించుకునేందుకు పౌరుడు ఏదైనా చేయగలడు అని సదరు రైతు నిరూపించారని ప్రశంసించారు. నెటిజన్లు రైతు సాహసానికి ఫీదా అవుతున్నారు..












Click it and Unblock the Notifications